కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత కూడా ఈ స్నేహం కొనసాగింది. ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండానే, హైదరాబాద్ లోని ఏపి సెక్రటేరియట్ భవనాలు, తెలంగాణాకు అప్పగించే ఆదేశాలు ఇచ్చారు జగన్. అప్పటి నుంచి, నాలుగు, అయుదు సార్లు ఇద్దరూ కలిసారు. అయితే ఏపికి లాభం చేకూరే ఏ నిర్ణయం కూడా కేసిఆర్ ప్రకటించలేదు. మరో పక్క, గోదావరి నీళ్ళు, తెలంగాణా భూభాగం మీదుగా, శ్రీశైలం తరలించటానికి వేసిన ప్రణాళిక పై, ఏపిలో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ను నమ్మవద్దని, ఆయన తెలంగాణా ప్రయోజనాల కోసం, మనలను ముంచేస్తారని, చెప్పినా వినలేదు. జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో, ఈ విషయం పై మాట్లాడుతూ, కేసిఆర్ ఉదారస్వభ్యావం కలవారు అంటూ, ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అలాగే కేసిఆర్ కూడా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాలుగా , ఏపి ప్రభుత్వానికి సహకారం అందిస్తామని, కోర్ట్ లో వేసిన కేసులు కూడా వెనక్కు తీసుకుంటాం అని చెప్పారు. అలాగే ప్రత్యెక హోదా విషయంలో కూడా కలిసి పోరాడదాం అని అన్నారు.

kcr 15112019 2

ఇంత వరకు బాగానే ఉన్నా, గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తల ప్రకారం, ఇద్దరి సియంల మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ పై కూడా ఏపి వెనక్కు తగ్గిందని, తెలంగాణాతో సంబంధం లేకుండా, ఏపి ఒంటరిగానే, వెళ్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ధాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే, ఈ విబేధాలు నిజమే అని అర్ధమవుతుంది. విభజన హామీల్లో జాప్యం జరుగుతూ ఉండటం పై, తెలంగాణా బీజేపీ నేత, పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, తెలంగాణా వేసిన అఫిడవిట్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. కౌంటర్ అఫిడవిట్ లో, తెలంగాణా పై పలు ఘాటు విమర్శలు చేసింది, ఏపి ప్రభుత్వం.

kcr 15112019 3

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రాజెక్ట్ అని తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, జగన్ మొహన్ రెడ్డి, సియం హోదాలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క అఫిడవిట్ లో, పోలవరం ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ, తెలంగాణాలోని ముంపు మండలాలు , ఆంధ్రపదేశ్ లో కలపటం విషయంలో, తెలంగాణా రాష్ట్రానికి అభ్యంతరం చెప్పే హక్కు లేదని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, తెలంగాణాను ఒక పార్టీగా పరిగణించాల్సిన పని లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. అయితే, ఇద్దరి సియంల మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు, ఈ అఫిడవిట్ చూసిన తరువాత, ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతందని, వ్యక్తిగతాలు పక్కన పెట్టి, ఎవరి రాష్ట్రం గురించి, ఎవరికీ వారు ప్రాధాన్యం ఇచ్చి, వారు పోరాడితే, ఇరు రాష్ట్ర ప్రజలకు మంచిదని, విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read