ఆంధ్రప్రదేశ్ లో ఖర్చులు, అంచనాలు, వ్యయానికి సంబంధించి, కాగ్ తాజా రిపోర్ట్ విడుదల చేసింది. జనవరి 2021 వరకు ఈ ఏడాది ఆర్ధిక పరిస్థితి పై రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక సంక్షోభం దిశగా పయనిస్తుందనే విషయం అర్ధం అవుతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆర్ధిక ఏడాదిలో, గత పది నెలలుగా తీసుకుంటే, ఈ పది నెలల్లో ఏపి చేసిన అప్పు అక్షరాల రూ.73,913 కోట్లు. అయితే బడ్జెట్ లో మాత్రం, 48 వేల కోట్లు వరుకే అప్పు చేస్తామని ప్రకటించినప్పటికీ, కేవలం 10 నెలలకే రూ.73,913 కోట్లు రూపాయల అప్పుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అప్పు అంచనా కంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది 153 శాతం ఎక్కువ అప్పు చేసిందని, కాగ్ పేర్కొంది. దీంతో పాటుగా రెవిన్యూ రాబడి పెరిగినప్పటికీ, అనవసర ఖర్చులు పెట్టటంతో, రెవిన్యూ లోటు అధికంగా ఉంది. దీంతో రెవిన్యూ రాబడి పెరిగినా, ఉపయోగం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెవిన్యూ లోటు వెంటాడుతున్నట్టు కాగ్ రిపోర్ట్ చూస్తే అర్ధం అవుతుంది. రెవిన్యూ లోటు అంచనాని, బడ్జెట్ లో అయితే మాత్రం, 18 వేల కోట్లు చూపించగా, అసలు అంచనాలు మాత్రం, కాగ్ నివేదిక ప్రకారం, 54 వేల కోట్లకు చేరుకుంది. ఇదంతా కేవలం పది నెలల సమయంలోనే జరిగింది. ఇంకా రెండు నెలలు ఈ ఆర్ధిక ఏడాది మిగిలి ఉంది.

appulu 03032021 2

రెవిన్యూ రాబడి పెరిగినా కూడా, రెవిన్యూ లోటు వెంటాడటం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్ధిక క్రమశిక్షణ పాటించటంలేదు అనే విషయం అర్ధం అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల పై, అలాగే రాబడి పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టక పోవటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఊబిలో కూరుకుపోతుందని, కాగ్ పేర్కొంది. గత ఏడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు 46 వేల కోట్లుకాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు, అంటే పది నెలల్లోనే రూ.73,913 కోట్లుకు చేరుకుంది. అంటే దాదాపుగా లక్ష కోట్లకు పైగా అప్పు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్నట్టు కాగ్ నివేదిక చూస్తే అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ బారోయింగ్స్ ని కూడా దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ మూడు మార్గాల ద్వారా అప్పులు తీసుకుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో, 30 రోజులు పాటు స్పెషల్ డ్రాయింగ్స్, 26 రోజులు పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది అని చెప్పి, కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంటే బహిరంగ మార్కెట్ లో ఎవరూ రుణాలు ఇవ్వకపోతేనే, ఈ మూడు మార్గాల్లో రుణాలు తీసుకునే అవకాసం ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది అనేది, ఈ కాగ్ రిపోర్ట్ చూస్తే అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read