ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా, అనేక విధాల్లో ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ ఉన్నంత వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదు అనే ఉద్దేశమో ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఎలా వాయిదా వేయాలి అనే ఆలోచనలోనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికలు లేట్ అయ్యాయి, ఈ విషయం హైకోర్టులో ఉంది. గతంలో హైకోర్టులో విచారణకు రాగా, క-రో-నా తగ్గిపోతుంది కదా, ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఏకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, మిగతా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి కదా, మీకు ఏమిటి అభ్యంతరం అని హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీని పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో, ప్రభుత్వంతో చర్చించి, మెజారిటీ అభిప్రాయం తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరగటానికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. అయితే తమ అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, హైకోర్టులో కేసు వేసారు. ఎన్నికలు ఆపేయాలని కోరారు. వెంటనే స్టే ఇవ్వమంటే, కోర్టు మాత్రం స్టే ఇవ్వలేదు. విచారణ ముగించి, తీర్పు రిజర్వ్ లో పెట్టింది. అయితే విషయం కోర్టు పరిధిలో ఉండగానే, ఈ రోజు అసెంబ్లీలో క-రో-నా కారణంగా ఎన్నికలు జరపలేం అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసారు.

nimmagadda 04122020 2

ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశంగా విశ్లేషకులు అంటున్నారు. కోర్టు పరిధిలో అంశం ఉండగా, ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదీ కాక శాసనసభ తీర్మానం చేసింది కాబట్టి, కోర్టులో ఈ విషయంలో కలుగ చేసుకోకూడదు అనే వాదన కూడా తెచ్చే అవకాసం ఉంది. అయితే కోర్టులు ఇవేమీ పట్టించుకోవు అనుకోండి. కోర్టు పరిధిలో ఉన్న ప్రతి అంశం పై సమీక్ష చేసే అవకాసం కోర్టుకు ఉంది. అయితే ఈ చర్యతో, మరోసారి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుంది అనే సంకేతం వెళ్తుంది. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, రాజాస్థాన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, అలాగే ఈ రోజు కూడా కర్ణాటకలో కూడా ఎన్నికలు జరపమని అక్కడ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే మనకు మాత్రం కోర్టు చెప్పినా ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. మరి ఈ కేసు పై హైకోర్టుని ఏమి తీర్పు ఇస్తుంది ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే, మళ్ళీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే, ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read