ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు దాదాపుగా అన్నీ ఇలాగే ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు నరకం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఇక మరో పక్క రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ది పేరుతొ ప్రభుత్వం సెస్ బాదుడు బాదుతుంది. అయినా రోడ్డులు పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుల మీద ప్రయాణాలు చేయాలి అంటేనే, కూసాలు కదిలిపోతున్నాయి. కొత్త రోడ్డుల సంగతి తరువాత, ముందు ఉన్న రోడ్డులు బాగు చేయండని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే కాదు, ఈ రోజు ఒక పత్రికలో ఒక వార్తా వచ్చింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. సహజంగా ఎమ్మెల్యేలు అందరూ అదే రోజు తమ ఊరికి వెళ్ళిపోతారు. అయితే ఈ రోడ్డుల్లో, రాత్రి సమయంలో ప్రయాణం చేయలేం అని, ఉదయం వెళ్దామని అనేక మంది ఎమ్మెల్యేలు చెప్పినట్టు, వార్త వచ్చింది. ఇది రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి. అయితే ఈ రోడ్డుల పరిస్థితి పై బీజేపీ ఆందోళన చేస్తాం అంటూ ఈ రోజు కొన్ని చోట్ల ఆందోళన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డులను అధ్వానంగా చేసిందని, వెంటనే రోడ్డులను బాగు చేయాలనీ, ఈ రోడ్డులు బాగు చేయటానికి టెండర్లు పిలిచినా, ఎవరూ ముందుకు రావటం లేదు అంటూ, బీజేపీ నిరసన తెలిపింది.

road 05122020 2

అయితే ఈ ఆందోళన కృష్ణా జిల్లా మైలవరంలో కొద్దిగా ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. వెల్వడం - నూజివీడు రోడ్డు సరిగ్గా లేదు అంటూ, రోడ్డు పై కూర్చుని బీజేపీ నేతలు ఆందోళన చేసారు. అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఆందోళన చేస్తున్నారని, ఈ నిరసనకు అనుమతి లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ, పోలీసులు వచ్చి అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మైలవరం ఎస్ఐ, కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా, కేంద్రంతో చెప్పి, రోడ్డులు బాగుచేయించవచ్చు కదా అంటూ, వ్యాఖ్యలు చేసారు. దీంతో బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ మాటలు చెప్పటానికి నువ్వు ఎవరు అంటూ, ఎస్‌ఐ పై బీజేపీ నేతలు ధ్వజమేట్టారు. ఎస్ఐ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేసారు. దీంతో ఈ వివాదం పెద్దది అవుతుందని గ్రహించి, రంగంలోకి దిగిన సిఐ, నేతలతో మాట్లాడి, పరిస్థితి చక్క దిద్దారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read