తాను ఒక మంత్రి హోదాలో ఉన్నాను అనేది తెలిసో తెలియకో, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని. ముఖ్యంగా చంద్రాబాబు నాయుడుని అయితే, ఆయన వయసు, హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. గతంలో కౌంటర్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇలాంటి వారికి రియాక్ట్ అవ్వటం కూడా అనవసరం అంటూ కొడాలి నానిని పూర్తిగా వదిలేసింది. ఏదో మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు రావటం, చంద్రబాబుని తిట్టటం, జగన్ ని సంతోష పెట్టటం, తమ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే వారు చేసే పని. అయితే, ఈ క్రమంలో, కొడాలి నాని, ఈ రోజు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పటిలాగే చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అయితే ఇంతటితో ఆగకుండా, ఆ ఫ్లోలో బీజేపీ పార్టీని కూడా తిట్టేసారు, కొడాలి నాని. రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, మహమ్మారి కరోనాతో, దేశంలో బీజేపీ పార్టీని పోల్చారు.

ఈ దేశంలో ఒక కరోనా పుట్టింది అని, దాని పేరు బీజేపీ ని అన్నారు. ఈ కరోనా, వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను తినేస్తుందని అన్నారు. అలాగే త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ ని తినేస్తుంది అని అన్నారు. బీజేపీ అనే కరోనాకి అదీ ఇదీ అని ఉండదు అని, దేన్నీ అయినా తినేస్తుంది అని, ఈ కరోనా ఏపి రాష్ట్రానికి కూడా వచిందని, మాస్కులు పెట్టుకుని జాగ్రత్త పడాలని అన్నారు. అయితే ఏదో ఫ్లో లో చంద్రబాబుని తిట్టినట్టు, తిడితే బీజేపీ ఊరుకుంటుందా. వెంటనే కొడాలి నానికి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చింది, ఏపి బీజేపీ. ఆయా రాష్ట్రాల్లో కష్టపడి మేము అధికారంలోకి వచ్చామని అన్నారు. అవినీతిలో పుట్టిన వైరస్ లాంటి పార్టీలకు, బీజేపీ వ్యాక్సిన్ అంటూ కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇప్పటికే తెర వెనుకా ముందు, కలిసిపోయి ప్రయాణం చేస్తున్న వైసీపీ, బీజేపీ మధ్య, కొడాలి నాని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసారో, అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read