ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు సిఐది అధికారులు, రఘురామరాజు ఇంటికి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న రఘరామ ఇంటికి ఏపి సిఐది అధికారులు వచ్చారు. అయితే రఘురామ కృష్ణం రాజు, ఇంకా లోపల నుంచి బయటకు రాకపోవటంతో, వాళ్ళు నలుగురు కూడా ఇంటి బయటే వెయిట్ చేస్తున్నారు. అయితే, గతంలో ఉన్న కేసులు నేపధ్యంలోనే ఆయనకు నోటీసులు ఇవ్వటానికి, ఏపి సిఐడి అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. విచారణకు హాజరు కావాలని, నోటీసులు ఇవ్వటానికి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఏ  కేసులు నేపధ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తున్నారు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే గతంలో సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో, ఏడేళ్ళ లోపు కేసు అయితే అరెస్ట్ చేసే అవకాసం లేదు. దీంతో అరెస్ట్ అయ్యేంత సీన్ ఉండదు కానీ, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వటానికి, సిఐది అధికారులు వచ్చి ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే సిఐడి అధికారులు ఉన్నారు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read