ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 13 కేసులు నమోదు కాగా... ఈ రోజు మరో మూడు కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఉంటున్న రాజస్థాన్​ యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అతను ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు.... ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆ గ్రామం 3 కిలోమీటర్ల చుట్టూ కరోనా జోన్​గా ప్రకటించారు. ఏపీలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నిర్ధరణ అయిందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

సంజామల మండలం నొసం గ్రామంలో ఉంటున్న 23 ఏళ్ల రాజస్థాన్ యువకుడికి కరోనా సోకినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అంతేకాకుండా నొసం గ్రామం 3 కిలోమీటర్ల చుట్టూ కరోనా జోన్​గా.... 7 కిలోమీటర్ల చుట్టూ కొవిడ్- 19 బఫర్ జోన్​గా ప్రకటించారు. రాకపోకలను బంద్ చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 12న ఢిల్లీలో దంపతులిద్దరు మతపరమైన కార్యక్రమానికి వెళ్లి 18న ఒంగోలుకు వెళ్లినట్లు గుర్తించారు. వీరిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది.

నొసం గ్రామానికి ఈనెల 23న రాజస్థాన్‌ నుంచి నలుగురు వచ్చారు. వారిలో ప్రస్తుత బాధితుడు ఒకరు. వారు నంద్యాల నుంచి నొస్సం మీదుగా కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళ్లే రైల్వే రహదారి నిర్వహణ పనులు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన మొత్తం 22 మంది ఈ పనులను చేస్తున్నారు. ఈనెల 25న బాధితుడు విపరీతమైన జ్వరంతో కర్నూలు సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో రాత్రి 11 గంటలకు చేరాడు. అతడిని వైద్యులు ఆస్పత్రిలోని మూడో వార్డులో చేర్పించారు. అతని నమూనాలు తీసి ల్యాబ్​కు పంపగా అతనికి కరోనా ఉందని ఇవాళ నిర్ధరణ అయింది. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతనికి చికిత్స చేసిన మూడో యూనిట్‌లో ఇప్పటికే కొందరు రోగులు డిశ్చారి అయి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరినీ అదుపులోకి తీసుకోనున్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read