దసరా ప్రయాణం పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయాసగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునరుద్దరణ కాలేదు. దీంతో ప్రైవేటు ట్రావెల కు విపరీతమై డిమాండ్ పెరిగింది. శుక్రవారం నుంచి హైదరాబాద్ టు విజయవాడ రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. దీంతో పాటే టిక్కెట్ ధర అమాంతం రూ.3వేలకు చేరింది. కరోనా కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆంధ్రా, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవడం లేదు. అలాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు సాగిన చర్చలు విఫలమయ్యాయి. దసరా సమయంలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. దీన్ని ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు లేకపోవడంతో టిక్కెట్ ధరలు ఐదు రెట్లు పెంచేసి ప్రయాణీకుల్ని దోచుకుంటున్నాయి. రానుపోను ఒక • ఫ్యామిలీ (నలుగురు కుటుంబసభ్యులు) వచ్చి వెళ్ళాలంటే టిక్కెట్లకే రూ.25,000 ఖర్చయ్యే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పలువురు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాలేంలే అని కుటుంబసభ్యులకు సరి చెప్పుకుంటున్నారు. ఇద్దరు సభ్యలే ఉంటే బైక్ పై జర్నీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

లాక్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కాకముందు వరకు నిత్యం 150 బస్సులు విజయవాడ టూ హైదరాబాద్ వెళ్లేవి. తద్వారా రూ.38 లక్షల రూపాయల మేర ఆదాయం వచ్చింది. దసర సమయంలో ప్రత్యేక సర్వీసుల పేరుతో 400కు పైగా బస్సు సర్వీసులు నడిచేవి. పండగ రద్దీని పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు ఛార్జీ వసూలు చేసేది. అయినా బస్సులు ప్రయాణీకులతో కిక్కిరిసేవి.. విజయవాడ టూ హైదరాబాద్ రూటులో బస్సు సర్వీసులకు మంచి డిమాండ్ ఉంటుంది. కృష్ణా రీజియన్‌ ఆదాయం రోజుకు రూ.1.50 కోట్లు కాగా ఇందులో రూ.38 లక్షల ఆదాయం విజయవాడ టూ హైదరాబాద్ బస్సు సర్వీసుల నుంచి లభించేది. దసర, సంక్రాంతి పండుగ సీజన్లలో రూ.3 నుంచి రూ.4 కోట్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడట్లే. కృష్ణా రీజియన్లో ప్రస్తుతం 1,450 బస్సులు తిరుగుతున్నాయి. పండుగ రద్దీని పురస్కరించుకొని 450 స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. తిరుపతి, కడప, వైజాగ్ ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read