ముఖ్యమంత్రి జగన్ 10 నెలల పాలనలోనే రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటమే కాక ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని టీడీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండి పడ్డారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం నిత్యవసరాల ధరలు పెంచి పేదలపై భారం మోపుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ జీవో 68 విడుదల చేశారు. జీవోలు మార్చి నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు సార్లు పెంచారు. జగన తీసుకునే నిర్ణయాలు తుగ్లక్ ని మరిపిస్తున్నాయి. ఏ1, ఏ2 లకు పాలన చేతకాక ధరలు పెంచి తడిగుడ్డతో పేద ప్రజల గొంతు కోస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నాయని సీఎన్ ఢీసీ చెప్తుంటే రాష్ర్టంలో వాటి ధరలు పెంచటం తుగ్లక్ పాలనకు నిదర్శనం. పోరుగు రాష్ట్రాల కంటే మన రాష్ర్టంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. 2019-20 బడ్జెట్ లో లక్షా 78 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఈ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వచ్చిన ఆదాయం కేవలం రూ. 85 వేల కోట్లు మాత్రమే. జీఎస్టీ ద్వారా రూ. 37 వేల కోట్లు ఆదాయం వస్తుందని బుగ్గన అంచనా వేస్తే .. వచ్చింది కేవలం రూ. 22 వేల 900 కోట్లు మాత్రమే.

చంద్రబాబు పాలనలో టార్గెట్ ని మించి 119 శాతం జీఎస్టీ వసూళ్లు వచ్చాయి, రెండెంకెల వృద్ది రేటు సాధించాం. ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ఆధాయం 50 శాతం పడిపోయింది, రూ. 46 వేల కోట్ల అప్పు భారం పెరిగింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్రం నుంచి రూ. 66 వేల కోట్లు తీసుకురావాల్సి ఉండగా... కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే తీసుకు వచ్చారు. పీపీఏల విషయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఏర్పరచుకుంది. వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే కేంద్రం రాష్ర్టానికి నిధులివ్వటం లేదు, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. జగన్ తన తప్పుడు నిర్ణయాలతో అంతర్జాతీయంగా రాష్ర్ట ప్రతిష్ట దెబ్బతీసి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టం నుంచి అనేక పరిశ్రమలు తరిమేసి యువతను రోడ్డున పడేశారు. ఇచ్చిన హామీల్లో కోతలు విధించి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. విధ్యార్డులకు మెస్ చార్జీలు, స్కాలర్ షిప్పులు ఇవ్వలేదు, రైతు భరోసా పూర్తిగా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు సంపద సృష్టించి పేదలకు పంచితే, జగన్ పేదల సంపద దోచుకుని వారిని రోడ్డున పడేస్తున్నారు.

ఇల్ల పట్టాల పేరుతో పేద ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిత్యసరాల ధరలు పెంచి ఓ వైపు, మరో వైపు అసైండ్ భూములు లాక్కుంటూ పేదల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ డబ్బుతో భూమి కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు 5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ జగన్ బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారు . విశాఖలో చంద్రబాబు పై రౌడీ మూకలతో జగన్ దాడి చేయించారు. . చంద్రబాబు నాయుడుకి సీఆర్పీ సెక్షన్ 151 కింద ఎలా నోటీసులిస్తారని పోలీసులకు కోర్టు మెట్టికాయలు వేసింది. ఇప్పడు అధికారులు ఏం సమాధానం చెప్తారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, తప్పు చేసినవారందర్నీ కోర్టుకీడుకిస్తాం. త్వరలో ప్రజా చైతన్య యాత్ర విశాఖ నుంచే ప్రారంభిస్తాం, పేదలకు అండగా నిలబడి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read