ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అయుదు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

రెండోది... విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పేదల ఇళ్ల పట్టాల కోసం 6 వేల ఎకరాలకు పైగా భూసమీకరణ సంబంధించి ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. మూడోది... రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే కేసులో, నాలుగోది... అమరావతి లో పేదల అసైన్డ్ భూములను భూ పంపిణీ కి తీసుకోవడానికి వీలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిదోది.... కరోనా వైరస్.. లోక్​​సభ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. మరో రెండు వారాలపాటు సాగాల్సిన లోక్​సభను షెడ్యూల్​ కంటే ముందే నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సమావేశాల్లో, మండలి రద్దు బిల్లు వస్తుందని జగన్ చాలా ఆశపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read