ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు సంకెళ్ళు వేస్తూ, జారీ చేసిన జీవో 2430 పై, దేశ వ్యాప్తంగా జరనలిస్ట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జీవో 2430 ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ప్రతిష్టితను దిగజారుస్తూ కధనాలు రాస్తే, వారి పై కోర్ట్ లో కేసు వేసే అధికారం, అధికారులకు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏ ప్రభుత్వం అయినా తప్పుని ఎత్తి చూపితే, తప్పు అని ఒప్పుకోదు. మరి ఏది ఎలాంటి వార్త అని, ప్రభుత్వం ఎలా నిర్ణయించి, చర్యలు తీసుకుంటుంది, అంటే సమాధానం లేని ప్రశ్న. అయితే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల పై, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా, ఘాటుగా స్పందించింది. జీవో 2430 పై, తమకు వివరణ ఇవ్వాలంటూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. కలానికి కళ్లెం వేసే ఇలాంటి జీవోను సుమోటోగా తీసుకుంటునట్టు ప్రకటించి, సమస్య తీవ్రతను తెలియ చేసింది. అయితే ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాకి, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో తరువాత విషయం కాని, ఇప్పుడు ఏకంగా ప్రెస్ కౌన్సిల్ కే జర్క్ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

jagan 102112019 2

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆవిర్భావం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్‌ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుతారు. అయితే, ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో జరిగే ఈ వేడుకులు, ఈ ఏడు, మన ఆంధ్రప్రదేశ్ లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జరుగుతున్న పరిణామాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కాని, ఈ వేడుకులు మేము జరపలేం అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. అసలు అయితే, ఈ వేడుకులు, ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరగాల్సి ఉండగా, ఐజేయూ అధ్యక్షుడుగా ఉన్న దేవులపల్లి అమర్‌, ప్రెస్ కౌన్సిల్ ను ఒప్పించి, విజయవాడలో జరిగేలా ఒప్పించారు. విజయవాడలో ఈ వేడుకులు పెద్ద ఎత్తున చెయ్యాలని, జాతీయ ప్రెస్ డే నిర్వహించాలని అనుకున్నారు. ఈ వేడుకుల్లో జాతీయ, అంతర్జాతీయ జరనలిస్ట్ లు పాల్గుంటారని, ముఖ్య అతిధిగా జగన్ ను పలిచి, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెయ్యాలని అనుకున్నారు.

jagan 102112019 3

అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ఐ & పీఆర్ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి టి.విజయకుమార్‌ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ లేఖ రాసి, మా సియం బిజీగా ఉన్నారని, ఫోర్త్ ఎస్టేట్ గా పిలిచే మీడియా పట్ల మాకు ఎంతో గౌరవం ఉందని, అయితే ఈ సారికి మరో చోటు చూసుకోండి అంటూ లేఖ రాసారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల అవాక్కవటం, సీనియర్ జర్నలిస్ట్ ల వంతు అయ్యింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని, దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రతినిధులకు చెప్పామని, ఇప్పుడు వారికి మళ్ళీ ఢిల్లీలోని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరుగుతుందని చెప్పాల్సి వచ్చిందని, చివరి నిమిషంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెయ్యటం సమంజసం కాదని విమర్శించారు. అయితే, రాష్ట్రంలో మీడియాని కట్టడి చేసే జీవో పై ఆందోళనలు జరుగుతూ ఉండటంతో, వేడుకలకు వచ్చే జర్నలిస్ట్ లు, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తారేమో అని, ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానం కలుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read