కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాన్ తీరం తాకిన తరువాత కొంచెం సానిస్తుంది, మళ్ళీ తీరం దాటే సమయంలో విధ్వసం చేస్తుంది. అయితే ఈ కొంచెం సమయం కూడా ప్రభుత్వ యంత్రాంగం, రెస్క్యూ ఆపరేషన్ చెయ్యటానికి ఉపయోగించుకుంటుంది. తుఫాన్ ఒక వృత్తాకారంలో ఉంటుంది, ప్రస్తుతం పైథాయ్ కాట్రేనికోన దగ్గర తీరాన్ని దాకింది. ఈ పైథాయ్ పరిధి కొంచెం పెద్దగా ఉండటం వల్ల ప్రస్తుతం పైథాయ్ కన్ను పరిధి కాట్రేని కోన ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యుంది.

cyclone 17122018 2

తుఫాన్ వృత్తంలో ముందుబాగం కాకినాడ ప్రాంతంలో ఉంది. వృత్తంలో వెనుక భాగం ఇంకా తీరం దాటలేదు. అది కూడా తీరాన్ని దాకిన తర్వాతే తుఫాన్ పూర్తిగా తీరం దాటినట్లు భావించాలి, తుఫాన్ కన్ను ఉన్న కొద్ది సమయంలో సహాయక చర్యలు తీసుకుంటే వెనుక భాగం తీరాన్ని దాటే లోపు విధ్వంసాన్ని తగ్గించవచ్చు, ప్రస్తుతం ఎపి ప్రభుత్వం ఆ పనిలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యున్నత స్థాయి గా చెప్పుకోవచ్చు, సూపర్ సైక్లోన్ లు ఎక్కువగా వచ్చే అమెరికా లో కూడా తుఫాన్ వృత్తం వెనుక బ్గాగం కూడా తీరాన్ని దాటాకే సహాయ చర్యలు చేపడతారు. మనం మాత్రం తుఫాన్ కన్ను ఉన్నప్పుడు కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపడుతుంది.

cyclone 17122018 3

మరో రెండు గంటలపాటు దీని ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తిత్లీ తుపానుతో పోల్చితే దీని తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తిత్లీ 150 కి.మీ వేగంతో తీరం దాటితే.. ఇది 90 నుంచి 100 కి.మీ వేగంతో ఇది తీరాన్ని దాటినట్లు అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. సాయంత్రం వరకూ ఎవరు బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read