ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య, దాదాపుగా ఏడాదిగా, పోరు జరుగుతూనే ఉంది. ఈ పోరులో, ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ అయినా సరే, వాళ్ళ మాట ప్రభుత్వం వినటం లేదు కాబట్టి, అంతిమంగా ఇద్దరూ కోర్టులోనే తెల్చుకుంటున్నారు. అయితే ఇక్కడ కోర్టుల్లో ప్రతి సారి ఎన్నికల కమిషన్ కు అనుకూలంగానే తీర్పులు వస్తున్నాయి. ఒక్క హైకోర్టు మాత్రమే కాదు, సుప్రీం కోర్టులో కూడా ఇదే జరుగుతుంది. మొన్న హైకోర్టు సింగల్ బెంచ్ లో మాత్రమే, ప్రభుత్వానికి ఒకసారి ఊరట లభించింది. అయితే ఉదయం హైకోర్టు, ఎన్నికలు జరుపుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పై ప్రభుత్వం, ఈ రోజు సాయంత్రం సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలని, సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఇక్క ప్రభుత్వానికి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే , ఏది జరిగినా రేపే జరగాలి. రేపు సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది తేలాలి. ఎందుకంటే, ఇది వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ప్రకారం, జనవరి 23న నామినేషన్లు స్వీకరణ మొదలుఅవుతుంది. అంటే ఎన్నికల ప్రక్రియ మొదలు అయిపోయినట్టే. రేపు విచారణకు రాకపోతే, మళ్ళీ వచ్చే వారం దాకా ప్రభుత్వం ఎదురు చూడాలి.

sc 21012021 2

ఈ లోపు నామినేషన్లు మొదలు అయి పోతాయి. సహజంగా, అసలు ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో, కోర్టులు జోక్యం చేసుకోవని చెప్తూ ఉండగా, ఎన్నికల ప్రక్రియ మొదలు అయిపోతే, అసలు అప్పుడు సుప్రీం కోర్టు, ప్రభుత్వ వాదనను అసలు పరిగణలోకి తీసుకునే అవకాసం ఉండదని అంటున్నారు. కాబట్టి రేపు ఒక్క రోజు ప్రభుత్వానికి సమయం ఉంది. ఇక పొతే గత ఏడాది ఎన్నికల కమిషన్, ఎన్నికలు వాయిదా వేసినప్పుడు , కోర్టులు జోక్యం చేసుకోలేదు, ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వదిలేసాయి. ఇక ఆ తరువాత నిమ్మగడ్డను తొలగించినప్పుడు కూడా, కోర్టులు ఆ చర్యను తప్పుబట్టి, మళ్ళీ నిమ్మగడ్డకు ఇచ్చాయి. ఇక తరువాత ప్రభుత్వం, తమను ఇబ్బంది పెడుతుందని రమేష్ కుమార్ చెప్పిన ప్రతి సారి, రాజ్యాంగ సంస్థకు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఇలా ప్రతి సారి, ఎన్నికల కమిషన్ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. మరి ఈ సారి, ఈ మొత్తం ఎపిసోడ్ కి ఫైనల్ టచ్ గా సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో చూడాలి. ఏది ఏమైనా, రేపు విచారణకు వస్తే, రేపే ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read