ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని వింత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు చూసారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలో, కనిపించిన దానికి, కనిపించనట్టు, ఏది కనిపిస్తే దానికి తమ పార్టీ రంగులు వేసుకుంటూ వెళ్లారు. గేద కొమ్ములు, చెత్త బుట్టలు, స్మశానాలు, ఆకులు, గుడిలు, గడ్డర్లు, ఇలా ఏది కనిపిస్తే దానికి వేసుకుంటూ వెళ్లారు. అయితే ఇక్కడ వరకు బాగానే ప్రభుత్వ భావనలకు, స్కూల్ బిల్డింగ్లకు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా తమ పార్టీ రంగులు వేసుకున్నారు. పోనీ వీళ్ళు ఏదైనా కొత్తది కట్టి, వేసుకున్నారా అంటే అదీ కాదు. ఎప్పుడో గత ప్రభుత్వాలు కట్టిన భవనాలకు, చివరకు బ్రిటీష్ కాలంలో కట్టిన భావనలకు కూడా తమ పార్టీ రంగులు వేసుకున్నారు. చివరకు ఒక చోట అయితే, ఏకంగా జెండా దిమ్మకు కూడా రంగులు వేసేసారు, గాంధీ తాత విగ్రహానికి కూడా వేసేసారు. అయితే ఈ పనులు చూసిన కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీని పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. వెంటనే రంగులు మార్చమంది. అయినా మార్చకపోవటంతో, అధికారులని బాధ్యులను చేసింది. తరువాత మరొక్క రంగు కలిపి, ఇది పార్టీ రంగు కాదని చెప్పే ప్రయత్నం చేయటంతో, హైకోర్టు మరింత సీరియస్ అయ్యింది. ఇక తరువాత మార్చాల్సిన పరిస్థితి రావటంతో, మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. హైకోర్టు కంటే ఎక్కువగా సీరియస్ అయ్యింది సుప్రీం కోర్ట్. దీంతో ప్రభుత్వానికి రంగులు మార్చటం తప్ప, వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

hc 011122020 2

ఒకసారి పార్టీ రంగులు వేయటానికి ఖర్చు. మళ్ళీ తెల్ల సున్నం. మళ్ళీ పార్టీ రంగులు తీయటానికి ఖర్చు. ఇలా కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే ఈ అనవసరపు ఖర్చు ప్రజల పై భారమే అవుతుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం పై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు విషయంలో, వేయటానికి తీయటానికి అయిన ఖర్చు మొత్తం, వారి నుంచే రాబట్టాలి అంటూ పిటీషన్ దాఖలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగులు వేయటానికి, తీయటానికి దాదాపుగా 4 వేల కోట్లు ఖర్చు అయ్యింది అంటూ, పిటీషనర్ తెలిపారు. ఈ 4 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా చూడాలని హైకోర్టుని కోరారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణలను ప్రతివాదులుగా చేర్చి, పిటీషన్ దాఖలు చేసారు. అయితే అఫిడవిట్ సరిగ్గా లేదని చెప్పిన హైకోర్టు, అసలు వీరిని ఎందుకు ప్రతివాదులుగా చేర్చారో స్పష్టంగా తెలపాలని కోరింది. మొత్తానికి రంగులు విషయం మళ్ళీ హైకోర్టుకు చేరింది. ఈ విషయం పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read