ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. ఆ హామీల అమలు స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న హోం శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి అవసరమైన సమాచారం ఇవ్వకుండా కేంద్ర అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమై ఆంధ్రకు ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించింది. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులు వేర్వేరుగా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడి వరకు వచ్చిందని సమావేశాల్లో చిదంబరం ప్రశ్నించగా.. అధికారులు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు.

aphelp 16122018 2

ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలతో కూడిన నివేదికను పలు శాఖలకు పంపిన కమిటీ.. లిఖితపూర్వకంగా జవాబులివ్వాలని ఆదేశించింది. కానీ కొన్ని శాఖలే సమాధానాలు ఇచ్చాయి. దాంతో కమిటీ సమావేశమవుతున్నా ఆంధ్ర అంశాలు కాకుండా ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా.. గత సమావేశాల్లో ఆంధ్రకు ఏ ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారని అధికారులను కమిటీ అడుగగా.. 2015లో ఆంధ్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదిక ఆధారంగా నిధులు ఇస్తున్నామని వారు బదులిచ్చారు. కానీ ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. దాంతో ఆ నివేదికను తమకివ్వాలని కేంద్ర హోం, ఆర్థిక శాఖల అధికారులను కమిటీ చైర్మన్‌, సభ్యులు అడిగినట్లు సమాచారం.

aphelp 16122018 3

ఇప్పటివరకు ఆ నివేదికను కమిటీకి అందించకపోగా.. ‘ఆ నివేదిక మా వద్ద లేదు. మీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే కాస్త పంపిస్తారా’ అని కమిటీలో సభ్యుడిగా ఉన్న మన రాష్ట్ర ఎంపీకి అధికారులు ఫోన్‌ చేసి అడిగినట్లు తెలిసింది. ‘మా వద్ద లేదనే కదా.. మిమ్మల్ని నివేదిక అడిగింది. అయినా మీ వద్ద నీతి ఆయోగ్‌ నివేదిక లేకపోతే ఏ ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారు? ఆ నివేదిక ప్రకారమే నిధులు ఇస్తున్నామని కమిటీకి ఎలా చెప్పారు’ అని ఆ ఎంపీ ఘాటుగా నిలదీసినట్లు సమాచారం. బడ్జెట్‌ సమావేశాల వరకూ సమాచారమివ్వకుండా సాగదీస్తే.. ఆ తర్వాత కొద్దిరోజుల్లో ప్రస్తుత లోక్‌సభ గడువు ముగుస్తుందని, ఇక ఈ అంశం తెరమరుగవుతుందన్నది ప్రభుత్వ కుయుక్తిగా చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read