ఒక్కో ప్రభుత్వానికి, ఒక్కో పాలసీ ఉంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ అభివృద్ధి, సంక్షేమం సమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఈ మౌళిక సూత్రానికి లోబడే, పరిపాలన సాగిస్తూ ఉంటారు. అయితే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో సంక్షేమం కూడా ఎక్కడా తక్కువ చేయలేదు. రెండు సమానంగా జరిగాయి. అనంతపురం జిల్లా స్వరూపం మార్చేసే కియా లాంటి కంపెనీ వచ్చింది. ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో ఉంటాయి. కానీ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం, పెట్టుబడులు పై పెద్దగా శ్రద్ద పెట్టటం లేదని అంకెలు చూస్తే అర్ధం అవుతున్నాయి. ఉచితాలు తెచ్చి, ప్రజలకు పంచటమే సరిపోతుంది. ఆ ఉచితాలు ఇవ్వాలి అంటే ఆదాయం ఉండాలి కదా ? కానీ అప్పులు చేసి మరీ ఉచితాలు పంచుతున్నారు. పోనీ ఆదాయం పెంచే మార్గాలు చూస్తున్నారా అంటే అదీ లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విదేశీ పెట్టుబడులు తేవటంలో మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తో పోటీ పాడేది. ఒక్క కియానే రూ.13 వేల కోట్లు పెట్టుబడి. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, అక్టోబర్ 2019 నుంచి జూన్ 2020 వరకు లెక్కలు తీస్తే, మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు 1652.31 కోట్లు. గతంలో దేశంలో మూడు నాలుగు స్థానంలో ఉండే మన రాష్ట్రము, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా 12 వ స్థానంలో ఉంది. పక్కన ఉన్న తెలంగాణా 9044.7 కోట్ల విదేశీ పెట్టుబడి తేగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికైనా, తమ ప్రాధాన్యాలు మార్చుకోక పొతే, రాబోయే రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కునే పరిస్థితి వస్తుంది. పాలకులు గ్రహించాలని కోరుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read