పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ కదులుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఔదార్యం చాటుకొన్నారు. రూ.30 కోట్ల ఆర్థికసహాయాన్ని అందించాలని ఎన్జీవోలు నిర్ణయించారు. ఎన్జీవో కేడర్‌ నుంచి గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయుల వరకు రూ. 500 చొప్పున, నాలుగో తరగతి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి రూ. 200 చొప్పున సేకరించనున్నారు. ఇలా పోగుచేసిన రూ. 30 కోట్లను బాధిత కుటుంబాలకు సాయంగా అందించనున్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల తరఫున రూ.25 లక్షల సాయం అందించామని ’అప్పా’ ప్రతినిధులు తెలిపారు.

ngo 1902209

వివేకానంద స్కూలు యాజమాన్యం రూ.లక్ష , తణుకు ప్రగతి జూనియర్‌ కళాశాల యాజమాన్యం రూ.1.05 లక్షల విలువైన చెక్‌లను సీఎంకు అందజేసింది. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన కొందరు దాతలు రూ.1.16 లక్షలు విరాళంగా సీఎంకు అందజేశారు. ముదినేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు శోభనాద్రిచౌదరి, డాక్టర్‌ వైఎల్‌ ప్రసాద్‌, పీ కుమారి నాయకత్వంలో వారు చెక్కును సీఎంకు అందజేశారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ఎస్‌ఎస్‌ వర్మ తన వంతుగా రూ. 64,100 విలువైన చెక్‌ను తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సీ ప్రవీణ్‌కుమార్‌కు అందించారు. సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌కు ఆ చెక్‌ను జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేర్చారు.

ngo 1902209

ఆపన్నులకు సీఎం సాయం.. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చుల కోసం తనను కలిసిన పలువురికి సీఎం మానవతా దృక్పథంతో సాయం ప్రకటించారు. మానసిక వికలాంగుడైన తన కుమారుడు ఓం ప్రకాశ్‌కు వైద్య సాయం చేయాలని తిరుపతికి చెందిన వీ బుజ్జి అనే మహిళ అభ్యర్థించగా, సీఎం రూ.లక్ష మంజూరు చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బంధపల్లికి చెందిన ఎం మునికృష్ణగౌడ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతని వైద్యం నిమిత్తం సీఎం రూ.3.5లక్షలు మంజూరు చేశారు. అదే గ్రామానికి చెందిన బీ రామకృష్ణప్ప విద్యుత్‌ వైర్లు లాగుతుండగా, షాక్‌ తగిలి ఎడమ భుజం పోగొట్టుకున్నాడు. ఆయనకు సీఎం రూ. లక్ష మంజూరు చేశారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read