ఏపీ పై మరోసారి కుట్ర జరుగుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది దారుణమైన కుట్రని దీని వల్ల నష్టపోతామని చంద్రబాబు చెప్పారు. టీఆర్ఎస్‌తో అంటకాగే వైసీపీ వాళ్లు ఏపీలో గెలిస్తే నీళ్లు కూడా రావన్నారు. అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్‌లో వదిలేసి వచ్చామని, విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్రం మాట తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు. లేకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటున్నారు. మీ బెదిరింపులకు మేం బెదరం! ఒకవేళ ఎవరైనా వాళ్ల బెదిరింపులకు లొంగి రాష్ట్రంలో సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేదిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

cbn 21022019

నవ్యాంధ్రపై మరో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు బుధవారం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, విపక్ష నేత జగన్‌ పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు చేశారు. ‘‘తెలంగాణలో పది ఎకరాలున్న నాయకుడిని, కాలేజీలు ఉన్న మరో నాయకుడిని, ఫంక్షన్‌ హాలు ఉన్న నాయకుడిని బెదిరిస్తున్నారు. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని, రాజకీయ నాయకుల్ని, పార్టీలు మారమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అవసరమైతే హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను వదులుకుంటాం.. కానీ ఆత్మాభిమానం వదులుకోం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

cbn 21022019

పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేసిన వారితో రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు లాలూచీ పడుతున్నాయని పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. ఇటువంటి వారిని గెలిపిస్తే నవ్యాంధ్రకు నీళ్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. ‘‘మనలో మనకు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రభుత్వంతోనే సమస్యలు వస్తున్నాయి’’ అని అన్నారు. కొండవీడులో రైతు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంటే, దానిని పోలీసులపై నెట్టేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధి పర్చుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీతో స్నేహం చేశామని... ఆ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయనందునే కేంద్రంతో విభేదించామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read