కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెనుక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన బావమరిది ప్రమేయముందని, రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ జరుగుతున్నా కూడా, ప్రభుత్వం నియమించిన నిజనిర్థారణ కమిటీ అక్కడేమీ లేదన్నట్లుగా తూతూమంత్రంగా విచారణ చేసి సరిపెట్టిందని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం... ! "కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించి, తిరిగొస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర టీడీపీనేతలు, కార్యకర్తలపై వైసీపీ గూండాలే దా-డి చేశారు. వారిపై దా-డి చేసిందికాక, తిరిగి వారిపైనే తప్పుడు కేసులుపెట్టారు. ఎస్సీ,ఎస్టీల రక్షణకు ఉపయోగపడాల్సిన చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం కావాలనే దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షనేతలపై, ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించేవారిపై ఆచట్టాన్ని ప్రయోగిస్తోంది. ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని ప్రభుత్వం ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తుందో రాజధాని రైతుల విషయంలోనే చూశాము. దేవినేని ఉమాపై పెట్టిన 307, ఎస్సీఎస్టీ సెక్షన్లు కావాలని ఒక పథకం ప్రకారం పెట్టినవేనని అర్థమవుతోంది. ఉమా కారుడ్రైవర్ రాంగ్ రూటులో వచ్చాడని, తమకు దారివ్వకుండా, ఉమామహేశ్వరరావు అతని డ్రైవర్ తిరిగి తమనే దూషించాడని, ఎదురు వాహనం లోని కారుడ్రైవర్ కులం పేరుతో ఉమా దూషించాడని చెప్పి కేసు పెట్టారు. అవతలి కారులో ఉన్న డ్రైవర్ ఏ కులం వాడో , దేవినేని ఉమాకి ఎలా తెలుస్తుంది? సాయంత్రం 05.45 ని.లకు ఘటన జరిగిందని ఉమా, ఆయన కారు డ్రైవర్ తమనుకొట్టారని, రాత్రి 08 గంటల తర్వాత కేసుపెట్టారు. ఘటన జరిగిన తర్వాత జీ.కొండూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి అంత సమయం పడుతుందా? ఘటన జరిగాక అంత సమయం తీసుకోవాలా? ఇదంతా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం నడిచిన హైడ్రామా. అర్థరాత్రి వరకు దేవినేని ఉమాను నిర్బంధించి, ఎప్పుడో తెల్లవారేముందు పెదపారు పూడికి తరలించారు. తరువాత అక్కడి నుంచి నందివాడకు తీసుకెళ్లారు. దేవినేని ఉమాని కలవకుండా టీడీపీనేతలను, కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారు?

మాజీమంత్రిని కలవకుండా చేయడం ఎలాంటి ప్రజాస్వామ్యం? పోలీసుల దమనకాండ పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. ఈ వ్వవహారంలో డీఐజీ స్థాయి అధికారి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్ట్ లకు కూడా కొన్నిహక్కు లుంటాయి. అలాంటిది మాజీమంత్రిని ఎవరూ కలవకూడదు .. ఆయనతో ఎవరూ మాట్లాడకూడదని చెప్పడానికి పోలీసులకు ఏం అధికారముంది? ఈ ప్రభుత్వం తొలినుంచీ తప్పుడు కేసులు పెట్టడానికి అలవాటుపడింది. కావాలనే షెడ్యూల్ కులాల వారిని తమ కక్షసాధింపులకు, వేధింపులకు జగన్ ప్రభుత్వం పావులుగా వాడుకుంటోంది. అక్రమ మైనింగ్ జరగలేదంటూ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయవచ్చు. కానీ అనేక సార్లు కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మైనింగ్ జరుగుతుందని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. దేవినేని ఉమాని అరెస్ట్ చేస్తేనో, టీడీపీనేతలపై తప్పుడు కేసులపెడితేనో వారు ఆగుతారని ప్రభుత్వం భావిస్తే, అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. రాష్ట్రప్రజలకు, మరీముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ సోదరు లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీఎస్టీ చట్టమనేది ఎన్నోపోరాటా లు, ఎన్నో అణచివేతల తర్వాత ఆయావర్గాల రక్షణకు రాజ్యాంగం ద్వారా సంక్రమింపబడింది. అలాంటి చట్టాన్ని అభాసుపాలు చేయడానికి ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వానికి ఉపయోగపడటం బాధాకరం. ఎస్సీ,ఎస్టీచట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న పోలీస్ అధికారులపై కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ కేసులుపెట్టి, వారిని కోర్టులకీడ్చి, వారి సంగతి తేలుస్తాం. దేవినేని ఉమాపై దా-డి చేసిందికాక, ఆయనపైనే సెక్షన్ 307 కింద కేసుపెడతారా? ఉమామహేశ్వరరావు దా-డి చేశాడని చెప్పడం పూర్తిగా అవాస్తవం, పచ్చి అబద్ధం."

Advertisements

Advertisements

Latest Articles

Most Read