ఏదైనా ఒక విషయంలో ఒకసారి తప్పు జరిగితే, అది అజాగ్రత్త అనుకోవాలి. అదే రెండో సారి కూడా , అదే తప్పు మళ్ళీ జరిగితే, ఏమనాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రణాలతో చెలగాటం ఆడే సమస్య అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ? రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు వెళ్ళీ అంబులెన్స్ లను, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే, తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన పెద్ద సంచలనం అయ్యింది. చివరకు సుజనా చౌదరి, హైకోర్టులో పిటీషన్ వేయటంతో, తీవ్రంగా స్పందించిన హైకోర్టు, తెలంగాణా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు అయితే కేసీఆర్ తో మాట్లాడలేదు. కోర్టు జోక్యంతో, ఆ వివాదం సద్దుమణిగింది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో కానీ, నిన్న తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణాలోకి వైద్య సేవలు కోసం వచ్చే ఇతర రాష్ట్రాల వారు, ఇక్కడ హాస్పిటల్స్ నుంచి అనుమతి పత్రం తీసుకోవాలని, అది తెలంగాణా ప్రభుత్వం పెట్టిన కొత్త కాల్ సెంటర్ కు పంపిస్తే, అప్పుడు ఈ పాస్ ఇస్తామని, ఇవన్నీ తెలంగాణా సరిహద్దులో చూపిస్తే, అప్పుడు వేరే రాష్ట్రాల వారికి తెలంగాణాలో వైద్యం చేసుకోవటానికి అనుమతి ఇస్తామని చెప్పారు.

border 14052021 2

అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు వెళ్తున్న వందలాది అంబులెన్స్ లను మళ్ళీ తెలంగాణా ప్రభుత్వం అడ్డుకుంది. కొంత మందికి అనుమతి ఉన్నా, ఈ పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చామని, కొత్త నిబంధనలు తెలియదు అని, రోడ్డు మీద ఉన్నామని చెప్పినా, తెలంగణా పోలీసులు కనికరించటం లేదు. అయితే ఏపిలో సరైన వైద్యం దొరక్క హైదరాబాద్ వెళ్తున్న ఏపి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. నాకు , కేసీఆర్ కు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పే జగన్, ఎందుకో మరి కేసీఆర్ తో డైరెక్ట్ గా మాట్లాడి సమస్యను పరిష్కరించటం లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశం పై మళ్ళీ సుజనా చౌదరి, తన సన్నిహితులు ద్వారా కోర్టులో పిటీషన్ వేసారు. ఈ సారి కోర్టు ధిక్కరణ పిటీషన్ కూడా వేసారు. కోర్టు ఏదో ఒక డైరెక్షన్ ఇచ్చే దాకా, ఇటు జగన్ కానీ, అక్కడ కేసీఆర్ కానీ, స్పందించేలా లేరు మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read