ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయం విషయంలోనే కాదు, పెట్టుబడులు విషయంలో కూడా రివర్స్ లో వెళ్తుంది. కేవలం అప్పుల్లో మాత్రమే పెంచుకుంటూ పోతుందని, జరుగుతున్న విషయాలు చూస్తే అర్ధం అవుతంది. గత చంద్రబాబు హయంలో, కంపెనీల పెట్టుబడుల వార్తలతో ఎప్పుడూ ఏదో ఒక వార్త ఉండేది. అయితే గత ఏడాదిన్నరగా ఏపి ఆ వార్తలే మర్చిపోయింది. గతంలో ముఖ్యంగా, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకు రావటంలో, వివిధ పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి మరీ, ఏపి కంపెనీలు సాధించేది. మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు విషయంలో, అందరు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా వైపు చూస్తున్న పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ వైపు విదేశీ పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ప్రయత్నం చేసి, సక్సెస్ అయ్యారు. అలా వచ్చిందే, అనంతపురం జిల్లా రూపు రేఖలు మార్చేసే కియా పరిశ్రమ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఇలా ఎన్నో విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. 2017-2018 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చి, దేశంలోనే అయుదవ స్థానంలో నిలిచింది. అలాగే 2018-19 సంవత్సరానికి, ఏకంగా 19 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించి, నాలుగవ స్థానంలో నిలిచింది. అలా అనేక విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల్లో దూసుకుని వెళ్ళింది.

investments 05122020 2

2019లో అధికారం మారటం, ప్రభుత్వ విధానాలు మారటంతో, వచ్చిన కంపెనీలు కూడా వెనక్కు వెళ్ళాయి. లూలు లాంటి కంపెనీ అయితే, మేము ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతాం అని ప్రకటన కూడా విడుదల చేసింది. ఇలా పెట్టుబడుల్లో తిరోగమనం వైపు ఏపి అడుగులు వేసింది. అయితే ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన లెక్కలు చూస్తూ , పెట్టుబడులు విషయంలో ఏపి స్థానం చూసి, మరింత బాధ పాడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు టాప్ రాష్ట్రాలతో పోటీ పడిన ఏపి, ఇప్పుడు కనీసం టాప్ 10లో కూడా నిలువలేక పోయింది. కేంద్రం విభాగం అయిన, డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ , విదేశీ పెట్టుబడుల లిస్టు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఏడాది వచ్చిన విదేశీ పెట్టుబడులు లిస్టు తీస్తే, 12వ స్థానం వచ్చింది. కేవలం రూ.1,798.81 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది దేశంలో కేవలం 0.45%. పక్కన ఉన్న తెలంగాణా రూ.9,910 కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. నాలుగవ స్థానం నుంచి, 12వ స్థానానికి పడిపోయాం అంటే, ప్రభుత్వం తమ విధానాలు ఒకసారి సమీక్ష చేసుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read