బేసిన్లు లేవు, భేషీజాలు లేవు అని అటు వైపు కేసీఆర్, ఇటు అసెంబ్లీ సాక్షిగా, కేసీఆర్ ఈజ్ మాగ్నానిమస్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు, రాయలసీమ వచ్చి, రాయలసీమను రత్నాలు సీమను చేస్తా అని కేసీఆర్ చెప్పిన మాటలు, అలాగే కాళేశ్వరం వెళ్లి, రాయలసీమకే నష్టం జరిగే ప్రాజెక్ట్ అని చెప్తున్నా, కాళేశ్వరం వెళ్ళిన జగన్ వార్తలు ఇంకా మనకు గుర్తుండే ఉన్నాయి. ఇంకా అవి చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. గోదావరి నీళ్ళు, తెలంగాణా మీదుగా తీసుకువెళ్ళి, శ్రీశైలంలో పోసి, అక్కడ నుంచి తీసుకువెళ్తా అని చెప్పిన జగన్ వ్యాఖ్యల పై, పెద్ద దుమారమే రేగింది. కేసీఆర్ లాంటి వారిని నమ్మకూడదు, ఇది మీ ఇద్దరి సొంత వ్యవహరం కాదు, అని ఎంత చెప్పినా అప్పట్లో జగన్ వినిపించుకోలేదు. అయితే, ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైందో తెలియదు. గోదావరి, కృష్ణా అనుసంధానం చెయ్యాలి అనే, చంద్రబాబు ప్రణాళికలు పక్కకు వెళ్ళిపోయాయి. దండిగా ఉన్న గోదావరి నీళ్ళు ఎలా వాడుకోవాలి, ఎలా కృష్ణా నదికి అనుసంధానం చెయ్యాలి అనే ఆలోచన లేదు.

కృష్ణా నది పై, 10, 15 రోజులుకు వచ్చే వరద నీటి కోసం, అసలు వరద వస్తుందో లేదో తెలియని చోట, ప్రాజెక్ట్ కడతాం, విస్తరణ చేస్తాం అని జగన్ అనటం, అలా ఎలా కుదురుతుంది, మాకు మాట మాత్రం అయినా చెప్పరా, మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్ట్ ఎలా కడతారు అంటూ కేసీఆర్ అనటం, మా నీళ్ళు మేము వాడుకుంటే మీకు బాధ ఏమిటి అని ఇటు వైపు, మీ నీళ్ళు కాదు, మా ప్రాంతం ఎండిపోతుంది అని అటు వైపు, ఉన్నట్టు ఉండి, ఎందుకు వచ్చిందో కానీ, లేని వివాదం వచ్చింది. పోనీ ఇదేమన్న ఒక్క 50 టిఎంసీలో, 100 టీఎంసీలో తీసుకు వెళ్ళ ప్రాజెక్ట్ ఆ అంటే అదీ కాదు. అయితే, అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్, రెండూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటం, అటు కేంద్రానికి, ఇటు కృష్ణా బోర్డు కు ఫిర్యాదులు వెళ్ళటం జరిగిపోయాయి.

ఈ నేపధ్యంలో, రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న విషయం నేపధ్యంలో, కేంద్రం ఎంటర్ అయ్యింది. ఈ విషయం పై కీలక నిర్ణయం ప్రకటించింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పై, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత, కేవలం ఒక్కసారే ఈ సమావేశం జరిగింది. అప్పట్లో చంద్రబాబు, కేసీఆర్ ఈ మీటింగ్ కు వచ్చారు. ఇప్పుడు, మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది, రెండు రాష్ట్రాలకు సమాచారం పంపించింది. అలాగే కృష్ణా, గోదావరి వాటర్ బోర్డుకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో చర్చించే ఎజెండా పంపించాలని, రెండు రాష్ట్రాలను, కేంద్రం కోరింది. మరి, ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read