ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటే, అమరావతి కాదు, రాష్ట్రానికి మూడు ముక్కల రాజధానులు చేస్తాం, ఒక ముక్క విశాఖపట్నంలో, ఒక ముక్క కర్నూల్ లో, ఒక ముక్క అమరావతిలో పెడతాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం, గత ఏడాది సెప్టెంబర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రాజధాని అని, 5 కోట్ల ఆంధ్రులకు మంచి రాజధాని కోసం, 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి ఎంత మోర పెట్టుకున్నా, పట్టించుకోలేదు. దాదాపుగా 150 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు వెళ్ళే సమయంలో, అమరావతి రాజధాని గ్రామాల మీదుగా వెళ్తున్నా, వాళ్ళు చేస్తున్న ఆందోళనను మాత్రం జగన్ మోహన్ రెడ్డి కాని, ఒక్క మంత్రి కాని, కనీసం ఒక అధికారి కూడా వచ్చి పట్టించుకోలేదు. దాంతో, కొంత మంది రైతులు హైకోర్ట్ మెట్లు ఎక్కారు. ఇదే సందర్భంలో, ప్రభుత్వం, అమరావతి పై కక్ష తీర్చుకునే పనిలో, అనేక పనులు చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో, వేరే ప్రాంతం వారికి నవరత్నాల పధకంలో భాగంగా, ఇళ్ళ పట్టాలు ఇవ్వటం లాంటివి ఉన్నాయి. అయితే దీని పై కూడా రైతులు ఎదురు తిరిగారు. ప్రభుత్వం ఇక్కడ కూడా దిగి రాక పోవటంతో, హైకోర్ట్ కు ఎక్కారు. విశాఖకు రాజధానిని తరలించే విషయం పై, హైకోర్ట్ లో వాదనలు జరగగా, రెండు బిల్లులు, చట్ట సభల్లో ఉన్నాయని, మండలిలో సెలెక్ట్ కమిటి ముందుకు రెండు బిల్లులు వెళ్లాయని, ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. దీంతో కోర్ట్ కూడా, ఈ విషయం పై తొందర పడ కుండా, ఈ రెండు బిల్లులు విషయం శాసనమండలిలో తేలే వరకు, ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళదు కాబట్టి, వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఇదే సందర్భంలో, మరో వార్త అమరావతి రైతులను కంగారు పెట్టింది.

సచివాలయ ఉద్యోగులు సమావేశం అయ్యి, మే నెల నాటికి విశాఖ వెళ్ళాలి అంటూ, కొంత మంది తీర్మానించటంతో, మళ్ళీ రైతులు కోర్ట్ మెట్లు ఎక్కారు. దీని పై సమాధానం చెప్పాల్సిందిగా, హైకోర్ట్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం, కీలక విషయాలు చెప్తూ, అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తరలింపు, పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. చట్ట సభల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయిని, దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తైన తరువాతే రాజధాని తరలింపు పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. సెక్రటేరియట్ ఉద్యోగుల సమావేశం గురించి తమకు సమాచారం లేదన్న ఏపీ ప్రభుత్వం, ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందని కోర్ట్ కు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read