ఉత్త‌రాంధ్ర ఓట‌ర్లు వైసీపీపై ఉవ్వెత్తున త‌మ వ్య‌తిరేక‌త‌ని వ్య‌క్తం చేశారు. ఓట్ల ద్వారా వైసీపీ అభ్య‌ర్థికి దారుణ ప‌రాజ‌యం చ‌విచూపించారు. మ‌రోవైపు త‌మ కోపాన్ని అణుచుకోలేక బ్యాలెట్ బాక్సుల్లో వైసీపీ మంత్రిపై స్లిప్పులు జార‌విడిచారు. ఉన్న‌త చ‌దువు చ‌దివి, రౌడీల కంటే ఘోర‌మైన భాష‌లో మాట్లాడే మంత్రి చీదిరి అప్ప‌ల‌రాజుని చీద‌రించుకుంటూ లేఖ‌లు బ్యాలెట్ బాక్సుల్లో పోస్టు చేశారు.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ సంద‌ర్భంగా అధికారులు సీదిరి అప్ప‌ల‌రాజు చీద‌ర ప‌నులు స్లిప్పుల్లో చూసి అవాక్క‌య్యారు. బ్యాలెట్ బాక్స్ లో మంత్రి అవినీతిపై పలాస పట్టభద్రులు  స్లిప్పులు వేశారు. మంత్రి భూకబ్జాలు, అనుచరుల అరాచకాలపై లెటర్లు రాసిన ఓటర్లు, త‌మ ఓట్ల‌తోపాటు బ్యాలెట్ బాక్సులో వేశారు. అవినీతి మంత్రి తమకు వద్దంటూ ఆ లేఖ‌ల్లో డిమాండ్ చేశారు. నిత్య‌మూ వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండే మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అవినీతి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాష్ట్ర‌స్థాయికి చేరింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read