విద్యుత్ ఒప్పందాల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, రోజుకి ఒకసారి ఏదో ఒక రూపంలో, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మొన్నటి దాకా కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం పై గుర్రుగా ఉంది. తాజాగా రెండు రోజుల క్రితం, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా, రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై, బహిరంగంగానే విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో, రాష్ట్రం పరువే కాకుండా, కేంద్రం పరువు కూడా పోతుంది అంటూ, మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. విద్యుత్ చట్టంలో ఉన్న, సెక్షన్ 63 ప్రకారం, ఒప్పందాలు కుదుర్చుకుంటే, అలాంటి ఒప్పందాల్లో, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కలుగ చేసుకోవటానికి వీలు లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌.

tribunal 29022020 2

రాష్ట్ర ప్రభుత్వం కుడుర్చుకున్న ఆ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూడాలి అని, అంతే కాని, వాటి పై, ప్రజాభిప్రాయం సేకరించి, దాని ప్రకారం, నిర్ణయాలు తెసుకునే అధికారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కు ఉండదు అంటూ, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. ఆ టారిఫ్ ఆమోదిస్తూ, షరతులతో కూడిన, అనుమతి ఇవ్వటం, కుదరదు అంటూ, ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి, స్పష్టం చేసింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీ ఎనర్జీ సోలార్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌, కడప రెన్యూవబుల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్ప్రింగ్‌ అగ్నిత్ర ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, ఏపీ డిస్కంలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు, కొన్ని షరతులు ఇస్తూ, అనుమతి ఇస్తూ రెగ్యులేటరీ కమిషన్‌ అక్టోబరు 5 2019న ఇచ్చిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టేసింది.

tribunal 29022020 3

కంపెనీలు కుదుర్చుకున్న పీపీఏ, కేంద్రం ఇచ్చిన పీపీఏ మార్గదర్శకాలు ప్రకారం ఉంటే, విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63 ప్రకారం, దీనికి రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి, అవసరం లేదు అంటూ, ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియలో కమిషన్ చూడాల్సింది, కేవలం, విద్యుత్ సేకరణ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రకారం చేస్తున్నారా లేదా అని మాత్రమే అని, అక్కడి వరకు మాత్రమే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసులో, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, టారిఫ్ నిర్ణయం తీసుకోవటం, విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి వ్యతిరేకం అంటూ, ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఒప్పందాలు చేసుకున్న విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి షరతులు లేకుండానే యూనిట్‌కు రూ.2.72తోపాటు, ట్రేడ్‌మార్జిన్‌ కింద 7 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read