ఏప్రిల్ 17న యువజన శ్రామిక రైతు పార్టీ భవిష్యత్తు తేలిపోనుంది. అదే రోజు తిరుపతి ఉప ఎన్నిక ఓటింగ్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయేది, ఆ రోజు జరిగే ఎన్నికకు, దీనికి సంబంధం లేని విషయం. తిరుపతి ఉప ఎన్నికల టెన్షన్ లో ఉన్న వైసీపీ, ఏప్రిల్ 17న కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ కూడా పట్టుకుంది. అయితే ఇదే ఏదో ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, పార్టీకి సంబందించిన విషయమే. కడప జిల్లాకు చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తమదని, మా పేరుని జగన్ పార్టీ వాడుకుంటుందని, చివరకు లెటర్ హెడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాసుకుంటున్నారని, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం అని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు నెలల పాటు ఈ కేసు విచారణ ఢిల్లీ హైకోర్టులో సాగింది. ఇటు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ భాష, అలాగే జగన్ పార్టీ నుంచి కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెండు విపుల నుంచి ఢిల్లీ హైకోర్టు వాదనలు వింది. ఇద్దరి వాదనలు విన్న తరువాత, వాదనలు ముగిసినట్టు ప్రకటించింది. దీని పై ఈ నెల 17న తీర్పు ఇస్తామని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.

ysrcp 12042021 2

దీంతో ఇప్పుడు ఏప్రిల్ 17న ఏమి అవుతుందా అనే టెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇప్పటికిప్పుడు ఏమి ఇబ్బందులు లేకపోయినా, ఢిల్లీ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, ఇది కూడా రఘురామరాజు పుణ్యమా అని, బయట పడిన విషయమే. విజయసాయి రెడ్డి, రఘురామరాజు కి నోటీస్ ఇవ్వటం, ఆ నోటీస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, రఘురామరాజు అభ్యంతరం చెప్పారు. తనకు బీఫాం ఇచ్చింది యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి అయితే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటూ ప్రశ్నించటంతో, అసలు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యింది. ముందు మా పార్టీ రిజిస్టర్ అయ్యిందని, ఎన్నికల కమిషన్ కూడా మాకే ఆ పేరు ఇచ్చింది, కానీ యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రం, మా పార్టీ పేరు వాడుకుంటుందని, ఇది అన్యాయం అంటూ, కోర్టులో కేసు వేసారు. మరి దీని పై కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో, చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read