జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అధికారంలోకి వచ్చిన వెంటనే, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‍గా, అలాగే ఇతర దేవాలయాలకు సంబంధించి, మాజీ కేంద్ర మంత్రి, అశోక్ గజపతి రాజుని తొలగిస్తూ, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగాతి తెలిసిందే. అశోక్ గజపతి రాజు స్థానంలో, సంచయత గజపతి రాజుని నియమించారు. అయితే దీని పై అశోక్ గజపతి రాజు హైకోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం మాత్రం, ఈ అంశం ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. పంతానికి పోయి, సంచయితను నియమిస్తూ జీవోలు జారీ చేసిన తరువాత, అనేక సార్లు ప్రభుత్వం విమర్శల పాలు అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఈ అంశం పై గత ఏడాది కాలంగా హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఈ రోజు హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‍గా నియమిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేసింది హైకోర్టు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా సంచయితను నియమిస్తూ జారీ చేసిన జీవోలు చెల్లవు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా, మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా తిరిగి అశోక్ గజపతి రాజుని మళ్ళీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలుతో పాటుగా, హైకోర్ట్ ప్రభుత్వానికి మరో షాక్ కూడా ఇచ్చింది.

ashok 14062021 2

ఈ ఆదేశాలు అన్నీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నాటి నుంచి కూడా అశోక్ గజపతి రాజే మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా కొనసాగుతారు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అంటే సంచయితను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అసలు చెల్లవు. ఆమె ఎక్కడా రికార్డుల్లో కూడా మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా ఉండరు. ఈ తీర్పుతో ఇప్పుడు ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాసం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా సంచయిత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు అన్నీ వెనక్కు వచ్చే అవకాసం ఉంది. అవన్నీ చట్టబద్ధం కాకుండా పోతాయి. ఇప్పుడు మళ్ళీ అశోక్ గజపతి రాజు గారు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మెన్ గా కూర్చోనున్నారు. అశోక్ గజపతి రాజు నుంచి మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానంను దూరం చేయాలని కొంత మంది ప్రభుత్వ పెద్దలు వేసిన ఎత్తులు చిత్తు అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం దీని పై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read