మాన్సాస్ ట్రస్ట్ లో రోజుకి ఒక వివాదం జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న మాన్సాస్ ట్రస్ట్ లో, వైసిపీ వచ్చిన తరువాత అలజడి రేగింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా, చివరకు రాజశేఖర్ రెడ్డి కూడా, ఎప్పుడు మాన్సాస్ ట్రస్ట్ జోలికి పోలేదు. అక్కడ ఆ రాజ కుటుంబం చేసిన త్యాగాన్ని గుర్తించిన గత పాలకులు ఎప్పుడూ వివాదం చేయటానికి ప్రయత్నం చేయలేదు. అయితే టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్టు, జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులో ముందుగా కోర్టులో కేసు వేసింది అశోక్ గజపతి రాజు గారు కాబట్టి , ఆయన పై కక్ష కట్టారో, లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి అశోక్ గజపతి రాజు గారిని టార్గెట్ చేసారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచలం సహా, మాన్సాస్ చైర్మెన్ గా అశోక్ గజపతి రాజు గారిని తొలగించి, సంచయితను నియమించారు. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా అశోక్ గజపతి రాజు గారిని టార్గెట్ చేస్తున్నారు. చివరకు కోర్టులో సంచయిత నియామకం చెల్లదు అని తీర్పు వచ్చినా, మరో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు మాన్సాస్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు గారు, ఇప్పుడు మరోసారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. గత వారం రోజులగా జరుగుతున్న పరిణామాల పై ఆయన హైకోర్టు వద్దకు వెళ్లారు.

hc 24072021 12

మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా ఉన్నటు వంటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా ఆయన వేధిస్తున్నారు అంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. అలగే మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా తనకు కూడా అతను సహకరించటం లేదని పిటీషన్ లో తెలిపారు. ఈవో నుంచి చాలా సమాచారం కోరానని, అయినా చైర్మెన్ అయిన తనకు ఆ సమాచారం ఇవ్వలేదని, సహకరించటం లేదని తెలిపారు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు కూడా స్వీకరించింది. ఏ బెంచ్ కు విచారణకు వస్తుంది, ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకు సోమవారం ఈ కేసు విచారణ వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మూడు రోజుల క్రితం తమకు జీతాలు ఇవ్వాలి అంటూ ఉద్యోగులు, ఈవో ముందు నిరసనకు దిగారు. అయితే దీన్ని కూడా వివాదస్పదం చేస్తూ, నిరసన తెలిపిన ఉద్యోగులతో పాటుగా, చైర్మెన్ అశోక్ గజపతి రాజు పై కూడా కేసు నమోదు చేయటం జరిగింది. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు హైకోర్టుకు వెళ్ళటంతో, ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read