విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. టీడీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. తప్పులను గుర్తించిన నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్‌షాప్ నిర్వహించింది. ఐదేళ్ల పాలనలో తప్పులపై టీడీపీ వర్క్‌షాప్‌లో నేతలు గళమెత్తారు. పార్టీ పెద్దల తప్పులను నేతలు, ప్రజాప్రతినిధులు ఎత్తి చూపారు. ప్రతి నేత తన మనోగథాన్ని వివరించారు. అంతేకాదు కేంద్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు జరిగిన పోరపాట్లను కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. వేల మందితో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లను ఆ పార్టీ నేత అశోక్ గజపతిరాజు తప్పు పట్టారు.

ashok 14062019

వేల మందితో టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందని మరో నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు బాగా దూరమయ్యారని జూపూడి అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ నివేదికలు కొంప ముంచాయని ఎమ్మెల్సీ శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. కోడెల కుటుంబం అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలిపారు. గ్రామ స్థాయిలో నేతల అవినీతిపై బాబుకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని, చంద్రబాబు చుట్టూ చేరిన బృందం వాస్తవాలు తెలియకుండా చేశారని దివ్యవాణీ వాపోయింది. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుదామని అనంతపురం జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కలిసి ఉండకపోతే మరింత నష్టం జరుగుతుందని అనంత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ashok 14062019

ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి సీట్లు తగ్గినా, ఓట్ల శాతం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచాం.. నాలుగుసార్లు ఓడాం. గెలిచినప్పుడు ఆనందం ఉంటుంది, అలాగే ఓడిపోయినప్పుడు ఆవేదన ఉండటం సహజం’ అని వ్యాఖ్యానించారు. ఏపీ విభజన అనంతరం తీవ్రమైన ఆర్థికలోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామనీ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై దృష్టి సారించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే పార్టీకోసం అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ నేతలు అండగా నిలవాలనీ.. పార్టీ శ్రేణులపై దాడులు జరిగితే వెంటనే ప్రతిస్పందించాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read