తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, దూకుడుగా వెళ్తుంది. నిన్న జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చి రాగానే, ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తుంటే, ఏమి జరుగుతుందో, ఎవరు ఎవరితో ఉన్నారో తెలియని పరిస్థితిలో ఏపి ప్రజలు ఉన్నారు. తనకు అడ్డు చెప్పిన శాసనమండలి వ్యవహారంలో, జగన్ మోహన్ రెడ్డి, ఘాటు నిర్ణయం తీసుకుంటూ, ఏకంగా మండలినే రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం ఇప్పుడు కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రం ఈ బిల్లుని పార్లమెంట్ లో, రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇది ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదు. మరో పక్క వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లులను, ఇప్పటికే మండలిలో సెలెక్ట్ కమిటీకి పమించిన సంగతి తెలిసిందే. మండలి చైర్మెన్ కూడా, దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శాసనమండలి సెక్రటరీ, ఏకంగా చైర్మెన్ రాసిన ఫైల్ నే వెనక్కు పంపించారు. దీంతో, తరువాత ఏమి జరుగుతుందో అని ఆసక్తి నెలకొన్న వేళ, ఈ రోజు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

శాసనసభ, శాసన మండలి ప్రొరోగ్ చేస్తూ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శాసనసభ, శాసన మండలి సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేసారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేసి రెండు కీలక బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లుల స్థానంలో, ఆర్డినెన్స్ తీసుకువచ్చి, మూడు ముక్కల రాజధాని విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాసం ఉందని, అందుకే శాసనసభ, శాసన మండలి ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు అమలుకై ఆర్డినెన్స్ జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే ఇది ఎంత వరకు నిలబడుతుందో తెలియని పరిస్థితి.

ఇప్పటికే, కోర్ట్ లో ఈ విషయం పై, వాదనలు వినిపిస్తూ, ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని ప్రభుత్వమే చెప్పింది. మరి ఇప్పుడు, మళ్ళీ ఒర్దినన్స్ తీసుకు వస్తే, కోర్ట్ ల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవుతాయో చూడాలి. నిన్న ఢిల్లీ వెళ్లి రాగానే, ఆర్డినెన్స్ వైపు జగన్ అడుగులు వేస్తున్నారు అంటే, కేంద్రం పై కూడా ఈ విషయంలో అనుమానాలు రాక మానవు. ఇక మరో పక్క, ఈ రోజు మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కుదరదంటూ, ఆ ఫైల్ ను మండలి కార్యదర్శి తిప్పి తనకు పంపటంపై ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శికి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆదేశాలు జారీ చేసారు. ఇంకా లేట్ చేస్తే, నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటానని ఛైర్మన్‌ షరీఫ్‌ ఘాటుగా హెచ్చరిస్తూ ఫైల్ పై తన స్పందనను పంపినట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read