వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అరెస్టు భ‌యంతో నిన్న‌టివ‌ర‌కూ వ‌ణికిపోయిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్క‌సారిగా రిలీఫ్‌గా ఫీల‌వుతున్నారా? త‌న త‌మ్ముడు అరెస్టు కాకుండా జ‌గ‌న్ రెడ్డి ఇటీవ‌ల చేసిన రెండు సార్లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు వ‌ర్క‌వుట్ అయ్యాయా? అంటే అవున‌నే విధంగా ప‌రిణామాలు చాలా స్పీడుగా మారాయి. నిన్న‌నే ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేసిన అవినాశ్ రెడ్డి, ఒక్క రోజులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ రివ‌ర్స్ తీసేసుకున్నారు. ద‌ర్యాప్తు అధికారిని మార్చాల‌ని ప‌దేప‌దే డిమాండ్ చేసిన అవినాష్ రెడ్డి , ద‌ర్యాప్తు అధికారి మార‌డేమో అని అనుమానంతో వివేకా హ-త్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖ‌లు చేశార‌ని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ద‌ర్యాప్తు అధికారి మారిపోవ‌డంతో అవినాష్ రెడ్డి 24 గంట‌లు గ‌డ‌వ‌కముందే త‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ని వెన‌క్కి తీసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుసార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఇక త‌న అరెస్టు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని డిసైడ‌య్యారు. ఆందోళ‌న‌లో ఉన్న అవినాశ్ రెడ్డిని స‌ముదాయంచిన జ‌గ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వ‌చ్చాక కాస్తా రిలీఫ్ గా ఉన్నార‌ని వైసీపీ ప్ర‌చారం సాగుతోంది. త‌న అన్న జ‌గ‌న్ రెడ్డి కేసు ముందుకు సాగ‌కుండా అన్నీ చూసుకుంటాడ‌నే ధీమాతో అవినాశ్ రెడ్డి ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేసు విచార‌ణ‌కి నెల రోజులే గ‌డువు ఉండ‌డం, త‌మ‌కు అనుకూలం కానుంద‌నే ఆనందంలో అవినాష్ రెడ్డి ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read