తెలుగునాట సంచలనం సృష్టించిన అయేషామీరా కేసు, 12 ఏళ్ళ తరువాత మళ్ళీ వార్తల్లో నిలిచింది. వైఎస్ఆర్ ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో, ఈ కేసు పెను సంచలనం అయ్యింది. అప్పటి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవుడు, అయేషామీరాను రే-ప్ చేసి, చంపేసారని, కాని అప్పటి ప్రభుత్వం దోషులను వదిలేసిందని అయేషామీరా తల్లి ఆరోపణ. అయితే 12 ఏళ్ళ తరువాత, ఈ కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. సిబిఐకి కొన్ని అనుమానాలు రావటంతో, ఈ కేసు పై విచారణలో భాగంగా, ఈ రోజు అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో, ఈ రోజు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27న, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా ఉదంతం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపాధ్యంలో ఈ రోజు అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం చేస్తున్న నేపధ్యంలో, అయేషామీరా తల్లి, షంషాద్‌ బేగం, వైసీపీ ఎమ్మెల్యే రోజా పై సంచలన ఆరోపణలు చేసారు.

roja 14122019 2

అప్పట్లో రోజా మా పక్షాన నిలిచి హడావిడి చేసారని, మా అమ్మాయి హత్య నిందితులు ఎవరో తమకు తెలుసని, అప్పుడు తమ వాదనకు మద్దుగా నిలిచి రోజా, గత 10 ఏళ్ళుగా మా వైపు కూడా చూడటం లేదని అన్నారు. ఆమె మా పై ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో, చెప్పాలని నిలదీశారు. ఒక వర్గం పై దాడి చేస్తేనే స్పందిస్తారా, మా లాంటి వారిని పట్టించుకోరా అంటూ రోజాని నిలదీశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని ఏమే తల్లి అన్నారు. అన్ని విషయాల్లో హడావిడి చేసే రోజా, మా గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మధ్యతరగతి వారికి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు.

roja 14122019 3

ఆంధ్రప్రదేశ్ లో ఆయేషా చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసారు. న్యాయం కోసం 12 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తాన్నామని అన్నారు. రీపోస్టుమార్టం అనేది తమ మత ఆచారాలకు విరుద్ధమని, అయనా నిజం బయటకు వస్తుంది, దోషులు ఎవరో సిబిఐ గుర్తిస్తుంది అనే నమ్మకంతోనే, ఒప్పుకున్నామని అన్నారు. దోషులు గురించి మేము మాట్లాడుతుంటే, తమ పై, కోటి రూపాయలకు దావా వేస్తాం అని బెదిరిస్తున్నారని, తమ వద్ద కోటి పైసలు కూడా లేవని, ఏమి చేస్తారో చేసుకోండి అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు. గతంలో తమకు 25 లక్షలు ఇస్తాం, కేసు మాఫీ చెయ్యాలని, అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసారు. ఇప్పటికైనా తమ కూతురుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read