దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయోషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సత్యంబాబును ఈ రోజు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ఆ తరువాత మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ను విచారిస్తున్నారు. గూడవల్లిలోని ఆయ్న స్వగృహంలో సతీష్ ను ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్లంలోని హాస్టల్లో ఆయోషామీరా పదేళ్ల కిందట హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులో కింది కోర్టు సత్యంబాబును దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. ఆయోషా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆయోషా హత్య జరిగిన సమయంలోనే ఆమె తల్లి షంషాద్ బేగం తన కుమార్తె హత్యకు కోనేరు సతీష్, అతడి స్నేహితులే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే.

aayisha 18012019 2

శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చేరుకున్న సీబీఐ బృందం సత్యం బాబును విచారించింది. సుమారు ఐదు గంటల పాటు సత్యంబాబును సిబిఐ టీమ్ విచారించింది. ఓ దశలో సిబిఐ అధికారులతో వాగ్వాదానికి దిగిన సత్యంబాబు... ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో అప్పట్లో పోలీసు అధికారులు మా అమ్మని, చెల్లిని చంపేస్తామని.. నన్ను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని సిబిఐ అధికారుల ముందు వాపోయిన సత్యంబాబు... ఆ హత్య కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. నన్ను కావాలనే బెదిరించి ఈ కేసులు ఇరికించారని సిబిఐ టీమ్‌కు వివరణ ఇచ్చిన సత్యంబాబు.. కొంతమంది అధికారులు కేవలం ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి నన్ను ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

aayisha 18012019 3

విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారనీ, ఆ టార్చర్ తట్టుకోలేక నేరం చేసినట్లు ఒప్పుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తనకు బతకడానికి పని కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, సిబిఐ విచారణ నేపథ్యంలో సత్యంబాబుకి మద్దతుగా అతని ఇంటి దగ్గర భారీగా చేరుకున్న స్థానికులు... సత్యంబాబుని మళ్లీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో సిబిఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సత్యంబాబు... ఈ కేసులో న్యాయం కోసం విచారణకు పూర్తిగా సహకరిస్తానని సిబిఐ అధికారులకు చెప్పినట్టు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read