ఈ రోజు తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో జరుగుతున్న మరో స్కాం బయట పెట్టింది. విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం కు సంబందించిన కొన్ని వివరాలు బయట పెట్టారు. అసలు ఈఎస్ఐ స్కాం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అని చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలు చెప్తూ, ఇప్పటికీ ఈఎస్ఐ స్కాంలో అచ్చెంనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసారని, ఆయన పై అనేక ఆరోపణలు చేసి, నాలుగు నెలలు విచారణ చేసి, రూపాయి కూడా అవినీతి ఆరోపణ నిరూపించలేక పోయారని వాపోయారు. అయితే ఇదే సమయంలో, ఈ స్కాంలో ఏ-14గా ఉన్న కార్తిక అనే వ్యక్తీ, విజయవాడలో ఒక చిన్న మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారని, అలాంటి వ్యక్తి, మంత్రి జయరాం కుమారుడు పుట్టిన రోజు నాడు, ఏకంగా ఒక ఖరీదైన బెంజ్ కారు, గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ బెంజ్ కారుని, మంత్రి కుమారుడు ఈశ్వర్ డెలివరీ తీసుకున్నారని, తరువాత ఆయనే ఆ కారు వాడుతూ ఉన్నారని చెప్పారు.

ఆ కారు పత్రాలు అన్నీ, ఈఎస్ఐ స్కాంలో ఏ-14 ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్నాయని, కానీ కారు డెలివరీ తీసుకుంది, వాడుతుంది మంత్రిగారే కుటుంబం అని చెప్పారు. దీనికి సంబంధించి ఫోటోలు, పత్రాలు కూడా మీడియాకు చూపించారు. అయితే ఒక సామాన్య వ్యక్తి, ఇంత ఖరీదు అయిన కారు, ఒక మంత్రికి ఎలా గిఫ్ట్ గా ఇవ్వగలరని, దీని వెనుక ఈఎస్ఐ కుంభకోణం మేళ్ళు ఉన్నాయని వాపోయారు. అయితే ఈ విషయం పై ముఖ్యమంత్రి గారు చెప్పిన, అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తున్నాని చెప్పి, మీడియా సమావేశంలోనే వారికి ఫోన్ చేసి, ఇలా ఈఎస్ఐ కుంభకోణంలో ఉన్న వ్యక్తి, మంత్రికి కారుని లంచంగా ఇచ్చారని, వారి పై ముఖ్యమంత్రి చెప్పినట్టు, 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అటు వైపు నుంచి మాత్రం, ఇలాంటివి మేము తీసుకొం అని, ఏసిబీ కార్యాలయానికి వచ్చి, వివరాలు ఇస్తే, వాళ్ళు చూస్తారని చెప్పటంతో, ఇది ప్రభుత్వ తీరు అంటూ, అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఎండగట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read