విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వందల మంది పోలీసులు రావటంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, విజయ్ పుట్టినరోజు పురస్కరించుకుని, ఆయన పుట్టిన రోజు వేడుకులు చేసుకోకుండా, నారా భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఆడవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిపేలా నిరసన కార్యక్రమం తలపెట్టారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అయితే పోలీసులు అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చి, కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పారు. అయ్యన్నపాత్రుడు మాత్రం, తాము ఏమి చేయం అని, కేవలం నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. అయితే మేము మాత్రం నిరసన కార్యక్రమం విరమించుకోమని, పోలీస్ స్టేషన్ కు వచ్చి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. అయితే నిరసన కార్యక్రమం చేపట్టటంతో, ఒక్కసారిగా పోలీసులు వచ్చి వారిని ఇష్టం వచ్చినట్టు లాగి పడేసే ప్రయత్నం చేసారు. దీంతో అయ్యన్నపాత్రుడు తేవర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అయ్యన్నతో పాటు టీడీపీ శ్రేణులురహదారిపై బైఠాయించిచారు. పోలీసులు తీరుకి నిరసనగా, అయ్యన్నపాత్రుడు ధర్నాకు దిగారు.

ayanna 24112021 2

పోలీసులు తీరు పై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని గంటలు అయినా, రాత్రి అయినా సరే తాము ఇక్కడే ఉంటాం అని, మీరు ఎంత సేపు ప్రతిఘటించినా ఇక్కడే ఉంటాం అని, శాంతియుతంగా చేస్తున్న నిరసనకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరుతున్నాం అని అన్నారు. తన చేతికి కూడా గాయాలు అయ్యాయని, ఆడవారి చీరలు కూడా లాగేసరని అయ్యన్న ఆరోపించారు. కేవలం పోలీస్ కంప్లింట్ ఇస్తామని చెప్పినా, ఎందుకు భయం అని నిలదీశారు. ఆడవారిని ఆటల్లో ఎక్కించి తీసుకుని వేల్లిపోతున్నారని, పోలీసులు తీరు మార్చుకోవాలని అన్నారు. ఈ రోజు మాత్రం వెనక్కు తగ్గేది లేదని, అటో ఇటో, ఈ రోజు తేల్చుకుంటాం అని, ఏది ఏమైనా ఈ రోజు వినతి పత్రం ఇచ్చి తీరుతాం అని, ఇక్కడే రోడ్డు మీద ఉంటాం అని అయ్యన్న అన్నారు. పోలీసులను వేడుకుంటున్నాం అని, ఇప్పటికైనా ఆలోచించాలని అన్నారు. ఆడవారి కించ పర్చుతూ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి పై కేసులు నమోదు చేయాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read