అసలు ఈ రోజు జోగి రమేష్, కొంత మంది రౌడీలను వేసుకుని, ఏకంగా చంద్రబాబు ఇంటి వరకు ఎందుకు వచ్చాడు, అసలు ఇష్యూ ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. అసలు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు ? ఆయన చేసిన విమర్శలు ఏమిటి ? అసలు చంద్రబాబు ఇంటి మీదకు వచ్చీ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది ? ఎప్పుడూ లేనిది ప్రతిపక్ష నేత, అలాగే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి ఇంటి పైకి వెళ్ళేంత ఏమి ఉంది ? ఇలా చాలా మందికి అసలు అయ్యన్న ఏమన్నారో తెలియదు. నిన్న కోడెల వర్ధంతి సందర్భంగా, జరిగిన కార్యక్రమంలో, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గుని, ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధ్వాన పాలన పై, స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, చెత్త మీద పన్ను వేసారని, ఇలాంటి వారిని చెత్త నా *** అని అనక ఏమంటారని అన్నారు. మరుగు దొడ్డి మీద పన్నులు వేసే వాడిని ఎక్కడైనా చూసామా ? అని అయ్యన్న ప్రశ్నించారు. 80 రూపాయల మందు బాటిల్ ని, 200 కి అమ్ముతున్నారు అని అన్నారు. ఈ మధ్య కాలంలో కరెంటు బిల్లు చూసారా, వీపు పేలిపోతుంది కదా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెంచుకుంటూ పోతా, పెంచుకుంటూ పోతా అంటే, మీరు ఏదో అనుకున్నారు, చివరాకు పెంచింది ఇవి అని అన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్న వాడిని, ముఖ్యమంత్రిని చేసాం, అనుభవిస్తున్నాం అని అన్నారు.

jogicbni 1792021 2

ఇలా మాట్లాడుతున్నానని నన్ను ఏమి పీకుతారు, మహా అయితే జైల్లో పడేస్తారు, పడేయండి అంటూ ఛాలెంజ్ చేసారు. అలాగే మంత్రులు గురించి కూడా అయ్యన్న మాట్లాడారు. నెల్లూరు ఇరిగేషన్ మంత్రికి టిఎంసి అంటే ఏంటో తెలియదు, బెట్టింగ్ ఆడతాడు అని అన్నారు. అలాగే కొడాలి నాని గురించి మాట్లాడుతూ, సన్న బియ్యం అని కూసిన నాని బూతులు మంత్రి, గుడి దగ్గర కొబ్బరి చిప్ప అమ్ముకునే వాడు, దేవాదాయ మంత్రి అంటూ మాట్లాడారు. హోంమంత్రి దిశ చట్టం లేకపోయినా, శిక్షలు వేసేశాం అని చెప్తున్నారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి చట్టం లేకుండానే, పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేసారని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని, ఈ అప్పులు తీర్చాల్సిందే మనమే అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మాంసం అమ్మటం, సినిమా టికెట్లు అమ్మటం కాదని, బ్రాందీ షాపుల్లో చీకులు, సినిమా బ్లాక్ టికెట్లు, మల్లె పూలు అమ్ముకో అని ఘాటుగా విమర్శలు చేసారు. అంబటి రాంబాబుకి గంట కావాలి అంట, అవంతికి అరగంట చాలు అంట, వీళ్ళు మన నేతలు అని అయ్యన్న అన్నారు. ఈ వ్యాఖ్యలకే జోగి రమేష్, చంద్రబాబు ఇంటికి వెళ్లి, హడావిడి చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read