తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని, గురువారం ఉదయమే, ఏపి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసారు. ఉదయం 3 గంటలకే, వందలాది మంది పోలీసులు అయ్యన్న ఇంటిని చుట్టు ముట్టి, అరెస్ట్ చేసారు. ముందుగా అయ్యన్న కుమారుడు రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత అయ్యన్నకు నోటీసులు ఇచ్చి, వెంటనే అరెస్ట్ చేసారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు ఇచ్చారు అంటూ, అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని మరీ అరెస్ట్ చేసారు. దీని పై అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇంత హంగామా ఎందుకని, నేనే వచ్చి అరెస్ట్ అయ్యే వాడిని కదా అని, అయ్యన్న చెప్తున్నా వినకుండా, అయ్యన్నని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. అయితే ఇవన్నీ నాన్ బెయిలబుల్‌ సెక్షన్ల అని, ఏలూరు కోర్టులో అయ్యన్నని హాజరు పరుస్తాం అని పోలీసులు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read