రాష్ట్రంలో బలమైన బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారు అంటూ, టిడిపి ప్రతి రోజు చెప్తూ ఉండగానే, జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి రోజు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నర్సీపట్నంకు చెందిన టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని జగన్ టార్గెట్ చేసారు. ఈ రోజు తెల్లవారుజామున ఉన్నట్టు ఉండి, అయ్యన్న ఇంటిని కూల్చివేసారు. పోలీసులు గోడ పగలగొట్టి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసారు. మొన్న చంద్రబాబు మొదటి రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భగంగా, మొదటిగా అనకాపల్లిలో మినీ మహానాడు పెట్టిన  సంగతి తెలిసిందే. ఈ మినీ మహానాడులో, అయ్యన్న జగన్ పై విరుచుకు పడ్డారు. ఈ నేపధ్యంలోనే, ఆయన చేసిన వ్యాఖ్యల పై, తట్టుకోలేక, ఎలాగైనా అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేయాలని, జగన్ భావించారు. నిన్న రాత్రి ఒకసారి పోలీసులు అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవటంతో, వెనక్కు వచ్చేసారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున, అయ్యన్న ఇంటి ప్రహరీగోడ కూల్చివేసారు. ఇరిగేషన్ స్థానంలో, అయ్యన్న ఇల్లు కట్టారని, అందులో రెండు సెంట్లు ఆక్రమించుకున్నారు అంటూ, నోటీసులు ఏమి ఇవ్వకుండా, ఉన్నట్టు ఉండి వచ్చి గోడ కూల్చివేసారు. అలాగే ఒక కానిస్టేబుల్, ఇంటి లోపలకు ఒక కానిస్టేబుల్ వెళ్లి, ఇంటికి తాళం వేసి, బయటకు వచ్చినట్టు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read