మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అన్నంత ప‌నీ చేశాడు. అకార‌ణంగా త‌ప్పుడు కేసుల‌తో త‌న‌ను, త‌న కుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేస్తున్న వారిని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే టిడిపి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక మీ సంగ‌తి తేలుస్తానని ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేదు. నేరుగా ప్రైవేటు కేసుల‌తో అధికారుల‌ను కోర్టుకి లాగారు అయ్య‌న్న పాత్రుడు. తన ఇంటి ప్రహరీ గోడను రాత్రి సమయంలో కూల్చివేసిన అధికారులపై నర్సీపట్నం అదనపు జూనియర్‌ సివిల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్త్రేట్‌ కోర్టులో సోమవారం ప్రైవేటు కేసు వేశారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. నీటి పారుదల శాఖ స్థ‌లంలో గోడ నిర్మించార‌ని ఆరోపిస్తూ ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేత‌కు ఆదేశాలు ఇచ్చిన‌ ఆర్డీవో గోవిందరావు, ఏఎస్పీ మణికంఠ, తహసీల్దారు జయ, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, మరో 14 మంది అధికారులపై అయ్య‌న్న‌పాత్రుడు  ప్రైవేటు కేసు వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశాలతోనే అధికార యంత్రాంగం ప్ర‌హ‌రీ ప‌డ‌గొట్టార‌ని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అక్ర‌మ కేసులు, దాడుల‌కు పాల్ప‌డుతున్న అధికారులు, పోలీసుల‌పై ప్రైవేటు కేసులు వేస్తామ‌ని ఎప్ప‌టి నుంచో బెదిరిస్తూ ఉంది. టిడిపి అన్న‌ట్టే అయ్య‌న్న‌పాత్రుడు ముందుకొచ్చి ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయ‌డంతో ప్ర‌భుత్వ ఆదేశాల‌తో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కి ఏం స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read