ఈ రోజు ఉదయం కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టటానికి, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. బాలయ్య, తారకరత్న లోకేష్ తో కలిసి నడక మొదలు పెట్టారు. అయితే కొద్ది దూరం నడిచిన తరువాత తారకరత్న సోమ్మసిల్లి పడిపోయారు. అందరూ వడదబ్బ అనుకున్నారు కానీ, చివరకు అది గుండెపోటు అని తేలింది. నడుస్తూ నడుస్తూ పడిపోయిన తారకరత్నను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. బాలయ్య స్వయంగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడ పరిస్థితితులు చక్కబెట్టారు.  యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు గుండెనొప్పిగా తేల్చి, ఒక స్టంట్ వేసారు. తారకరత్నకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక తారకరత్న విషయం తెలిసి, బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసారు. కళ్యాణ్ రాం కూడా బాలయ్యకు ఫోన్ చేసి, తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరం అయితే బెంగుళూరు తరలించాలని సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read