ఇటీవ‌ల వీర‌సింహారెడ్డి సక్సెస్ మీట్లో వేదిక‌పై సాధారంగా మాట్లాడుతుండ‌గా వ‌చ్చిన `రంగారావు, అక్కినేని తొక్కినేని గురించి మాట్లాడుకున్నాం` అనే ప‌దాన్ని ప‌ట్టుకుని విద్వేషాలు ఎగ‌దోయాల‌ని  వైసీపీ భారీ స్కెచ్ వేసింది. దీనికి అక్కినేని క్యాంప్ కొంత స‌హ‌క‌రించింది. ఎస్వీరంగారావు వార‌సులు చాలా హుందాగా స్పందించి పేటీఎం పెయిడ్ ఆర్టిస్టుల‌కు ప‌ళ్లు రాల‌గొట్టిన‌ట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అస‌లు ఈ వ్యాఖ్య‌లు చేసిన బాల‌య్య ఎలా స్పందిస్తారోన‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివ‌ర‌ణ ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్‍ఆర్ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు అని వారిని ఎప్పుడూ గౌర‌వించుకుంటూనే ఉంటాన‌న్నారు. అక్కినేనిని కించపరిచేలా నేను మాట్లాడలేద‌ని స్పష్టం చేశారు. ప్రాస కోసం, యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్పా, కావాలని అనలేద‌ని స్ప‌ష్టం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్ అని పిలుస్తాన‌ని, ఆయ‌న పిల్లల కంటే ఎక్కువగా నాపై ప్రేమ చూపేవార‌ని బాల‌య్య వివ‌రించారు. పొగడ్తలకు పొంగిపోవద్దని అనే విష‌యాన్ని అక్కినేని బాబాయ్ నుంచి నేర్చుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని చెప్పిన బాల‌కృష్ణ పేటీఎం బృందాలు సృష్టించిన‌ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read