కరోనా వచ్చిన దగ్గర నుంచి, అనేక ఫేక్ వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. చాలా మంది ప్రజలు అది నిజం అని నమ్ముతున్నారు కూడా. ముఖ్యంగా ఒక మతం పై, జరుగుతున్న విష ప్రచారం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే, అవన్నీ వివిధ సందర్భాల్లో, జరిగినవి. కాని అవి తీసుకొచ్చి, వారేదో కావాలని చేస్తున్నట్టు ప్రచారం చేసారు. చివరకు అవన్నీ ఫేక్ న్యూస్ లు అని తెలిసినా, ఆ మతాన్ని టార్గెట్ చేసుకున్న రాజకీయ పార్టీలకు, ఏమి కావాలో అది జరిగింది అనే చెప్పాలి. ఇక కరోనా పై అయితే, లెక్క లేని అన్ని ఫేక్ న్యూస్ లు వచ్చాయి. అవి తినాలి, ఇవి తినాలి, అలా చేస్తే కరోనా రాదు, ఇలా చేస్తే రాదు, కరోనాకి మందు దొరికింది, లేకపోతే కరోనాని ఒక దేశం కావాలని, అందరికీ అంటించింది అంటూ, ఇలా అనేక అనేక వార్తాలు, సోషల్ మీడియాలో తిరిగాయి. అయితే, జనాలు ఇంట్లో ఉండటం వల్లో ఏమో కాని, చాలా మంది ఇది నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే నిన్నటి నుంచి తిరుగుతున్న మరో వార్త, ఏకంగా ముఖ్యమంత్రులనే బుట్టలో పడేసింది.

దేశ వ్యాప్తంగా, 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో, వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఒక పక్క దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఉన్న సమయంలో, లాక్ డౌన్ ఎత్తేయాలా వద్దా అనే చర్చ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా,మోడీ ఈ విషయం పై మాట్లాడారు. అయితే కొంత మంది విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తేయాలని, హాట్ స్పాట్ లు ఉన్న చోట కొనసాగించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే, రెండు రోజులుగా ఒక వార్తా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ (బీసీజీ) ఒక నివేదిక విడుదల చేసింది అని, దాని ప్రకారం, సెప్టెంబర్ వరకు దేశంలో లాక్ డౌన్ ఉంటుంది అని రిపోర్ట్ చెప్తుంది.

ఇక అందరూ సోషల్ మీడియాలో ఇదే తిప్పటం మొదలు పెట్టారు. చివరకు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ రిపోర్ట్ గురించి చెప్తూ, ఇది ఒక పెద్ద గ్లోబల్ కంపెనీ అని, వారు అన్నీ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ తయారు చేసారని, చెప్తూ, జూన్ వరకు లాక్ డౌన్ ఉంటే మంచిది అంటూ చెప్పుకొచ్చారు. అయితే, నిన్న రాత్రికి, ఇది బాగా వైరల్ అవ్వటంతో, బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ స్పందించింది. లాక్ డౌన్ పొడిగింపు ఇస్తూ మా సంస్థ పేరుతొ తిరుగుతున్న రిపోర్ట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇండియాలో లాక్ డౌన్ పొడిగింపు పై, తాము ఎలాంటి అంచనాలు వెలువరించలేదని స్పష్టం చేసింది. తమ పేరుతొ తిరుగుతున్న అలాంటి వార్తలు నమ్మవద్దు అంటూ ప్రకటన చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read