బెజవాడ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగ వైరంగా ఉనన్ దేవినేని, వంగవీటి కుటుంబాలు, ఒకే పార్టీ గూటికి చేరాయి. కుటుంబాల మధ్య గొడవ, కులాల మధ్య గొడవగా మారి, ఎంత జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో, చంద్రబాబు అధ్యక్షతన, నవ్యాంధ్రను ముందుకు తీసుకువెళ్ళటానికి ఏకం అయ్యారు. బుధవారం రాత్రి రాధా తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాధాకు సీఎం కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైకాపా నేత యడం బాలాజీ కూడా తెదేపాలో చేరారు. రాధా చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.

thota 29102018 1

ఈ సందర్భంగా రాధా మాట్లాడుతు వైకాపా అధినేత జగన్‌పై విమర్శలు సంధించారు. రాజ్యాలున్నాయి పరిపాలిద్దామనే ఆరాటం వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డిదైతే, ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం తెదేపాదన్నారు. ఈ పోరాటంలో ఎవరికెవరికీ గిఫ్టులు కాదు.. మన ప్రజలకు మనమే గిఫ్టులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్‌ స్విచాఫ్‌ చేయాలనే నినాదంతో ముందుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడుతుంటారని.. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌.. వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. అంతకంటే వెన్నుపోటు ఉంటుందా అని నిలదీశారు. ఇప్పటికైనా జగన్‌ మారాలని సూచించారు.

thota 29102018 1

కాపులకు అండగా నిలిచింది తెదేపానే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వారికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014లో చివరి విడతలో ఎన్నికలు పెట్టారని, ఈసారి కావాలనే తొలి విడతలో పెట్టి సమయం చాలా తక్కువ ఇచ్చారని, అయినా ఫర్వాలేదని, ఎలాంటి సంక్షోభాన్నైనా అవకాశంగా మార్చుకునే సత్తా తమకుందని పేర్కొన్నారు. 2004లో కాపులకు కార్పొరేషన్‌ పెడతామని చెప్పిన వైఎస్‌ కేవలం కమిటీని వేసి వదిలేశారని, తాను పాదయాత్రకు వెళ్లినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశానని తెలిపారు. కాపుల కోసం తాను అసెంబ్లీలో తీర్మానం చేసి దిల్లీకి పంపిస్తే జగన్‌ అసలు అసెంబ్లీకే రాలేదని గుర్తు చేశారు. కేంద్రం పేదలకు ఇచ్చిన 10 శాతంలో తాను కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించానని వెల్లడించారు. 

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read