జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా, ఈ కంపెనీ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసులు, జైళ్ళు, బెయిల్ దాకా ఈ క్విడ్ ప్రోకో విషయాలు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, మళ్ళీ భారతి సిమెంట్స్ పై ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతి సిమెంట్స్ , మిగతా సిమెంట్ కంపెనీలతో సిండికేట్ అయ్యి, కృత్రిమ కొరత సృష్టించి, దాదాపుగా బస్తాకు వంద రూపాయలు పెంచేసిందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. నిజానికి సిమెంట్ ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే. ఇక భారతి సిమెంట్ సామర్ధ్యం చుస్తే, బస్తాకు వంద రూపాయలు పెంచితే, వారికి వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ పెరుగుతుందని, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇదే విషయం భారతి సిమెంట్స్ వాటా టెక్ ఓవర్ చేసిన కంపెనీ కూడా, తన యాన్యుల్ రిపోర్ట్ లో తెలిపినట్టు, ధరలు పెరుగుదల వల్ల, తమకు లాభాలు వచ్చినట్టు, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రాజెక్ట్ లు అన్నిటికీ భారతి సిమెంట్స్ వాడేలా, ఆదేశాలు వెళ్లాయని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు పై భారతి సిమెంట్స్ వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, వైసీపీ పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు. అయితే ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో, ఇదే అంశం పై సంచలన కధనం వచ్చింది.

ie 20012021 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆర్డర్ల మొత్తంలో, కేవలం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ నుంచి మాత్రమే, 14 శాతం సిమెంట్ ఆర్డర్లు తీసుకున్నట్టు ఆ కధనం ప్రచురించింది. అంటే, 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంట్ ని ప్రభుత్వం, భారతి సిమెంట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు, ప్రభుత్వం చేసిన సిమెంట్ కొనుగోళ్ళలో ఈ విషయం అర్ధమవుతుంది. తరువాత ఆర్డర్, జగన్ కేసుల్లో సహా నిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్ కు దక్కింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా ఉంటూ, అలాగే ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్(APCMA) వైస్-ఛైర్మన్ ఉన్న రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని కధనం. ప్రభుత్వ ఇచ్చే సిమెంట్ ఆర్డర్లు, 23 కంపెనీల మధ్య ఈ అసోసియేషన్(APCMA) సర్దుబాటు చేస్తుంది. అంటే, మొత్తం ఆర్డర్ల లో సుమారు 4.35% ఒక్కో కంపెనీకి రావాలి. కానీ ఒక్క భారతి సిమెంటుకే ప్రభుత్వ ఆర్డర్లలో 14% కట్టబెట్టారు అనేది ఆ పత్రిక కధనం. అయితే ప్రభుత్వం మాత్రం, కొన్ని కంపెనీలు సప్లై చేయలేక పోతున్నాయి కాబట్టి, కొన్ని కంపెనీల దగ్గర నుంచి ఎక్కువ కొన్నామని చెప్తుంది.అందుకే భారతి సిమెంట్స్ నుంచి 14 శాతం కొన్నారట.

Advertisements

Advertisements

Latest Articles

Most Read