రాష్ట్రంలో ప్రజలు ఉల్లిపాయల కోసం అల్లాడిపోతున్నారు. ఉల్లి కోయ్యకుండా, ఆ రేట్ చూస్తూనే, కన్నీళ్లు వచ్చే పరిస్థితి. రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం, రైతు బజార్ల ముందు బారులు తీరి, ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచుని, కేజీ ఉల్లిపాయలు ఇంటికి తీసుకువెళ్ళే పరిస్థితి. అయితే ఈ సమస్య పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో ప్రజల తరుపున పోరాడుతుంటే, అధికార వైసీపీ మాత్రం, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, కేవలం ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిన్న అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ, ఉల్లిపాయలు లేకపోతే చచ్చిపోతారు అనేలా మాట్లాడుతున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అలాగే, ఈ రోజు వ్యవసాయ మంత్రి కన్న బాబు మాట్లాడుతూ, ఉల్లిపాయ నిత్యావసర వస్తువు కాదని చెప్పారు. ఇక జగన్ మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు హెరిటేజ్ లో, కిలో ఉల్లిపాయలు 200 కి అమ్ముతున్నారు అంటూ, ఎదురు దాడి ప్రారంభించారు.

bhuvanesari 10122019 2

అయితే దీని పై చంద్రబాబు నిన్న అసెంబ్లీ వేదికగానే, హెరిటేజ్ ఫ్రెష్ కు మాకు సంబంధం లేదు, హెరిటేజ్ ఫ్రెష్ ని, 2016 లోనే, ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకు అమ్మేసాం అని చెప్పారు. అయినా సరే పదే పదే, హెరిటేజ్ ఫ్రెష్ లో చంద్రబాబు 200 కి అమ్ముతున్నారు అంటూ అసెంబ్లీలో చెప్తున్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు జగన్ కి ఈ విషయంలో ఛాలెంజ్ కూడా చేసారు. హెరిటేజ్ ఫ్రెష్ నాదని నిరూపిస్తే, రాజీనామా చేస్తానని, లెగిసి ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నా అని చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో గొడవ ఇలా ఉంటే, హెరిటేజ్ ఫ్రెష్ లో 200 లకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణల పై చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు.

bhuvanesari 10122019 3

ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, "అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అసెంబ్లీ సమావేశాలను చూడను. హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు. హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. కాగా, ఉల్లి ధరల పెరుగుదలపై నారా భువనేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని అనంరు. కిలో ఉల్లిపాయలు రూ.150 లకు అమ్మడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉల్లి ధరలతో గృహిణిగా తాను కడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఇంత ఎక్కువ ధరకు ఉల్లి ధరలను తాను ఇంత వరకు చూడలేదన్నారు. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read