అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శైలి గురించి అందరికీ తెలిసిందే... ఒక 15 రోజుల క్రితం దివాకర్‌రెడ్డి అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసారు... దాదాపు ఒక అరగంట సేపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థుతులు, చంద్రబాబు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి కుండబద్దలు కొట్టేసారు... మీరు ఏమైనా అనుకోండి, ఈ పనులు గురించి మీరు ఆలోచించాలి, నా సలహా పాటించాలి అంటూ, మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారు..

43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని దివాకర్ రెడ్డి అన్నారు.. ఇది మీరు వెంటనే కరెక్ట్ చేసుకోపోతే, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, దీని పై అలోచించి, అందరితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోండి అంటూ, జేసే దివాకర్ రెడ్డి చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. ఈ విషయం పై, చంద్రబాబు ఆరా తీసారు.. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బయోమెట్రిక్ ఎందుకు వద్దు అనేవి అరా తీసి, దీనిపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. బయోమెట్రిక్‌ హాజరుకు, జీతాలకూ మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమయపాలనలో కాస్త అటూ ఇటూ అయినా సరే... చిత్తశుద్ధితో పని చేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఉద్యోగస్తుల హాజరుకు బయోమెట్రిక్‌తో అనుసంధానం లేకపోయినా ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేశారు. దీని ఆధారంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు కింది స్థాయి వరకు స్పష్టం చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను, సాధారణ పరిపాలన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సమయం అటూ ఇటూ అయినా... ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చేయాలన్నది నా ఉద్దేశం. కానీ, దీనిని తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్‌కు - జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించారు. ఇది పూర్తిగా తప్పు. ఈ విషయంపై ఉద్యోగులందరికీ స్పష్టత ఇవ్వండి అని అధికారులని ఆదేశించారు... నేను మీకు ఇన్ని అవకశాలు ఇస్తున్నాను అంటే, మీరు ఇంకా బాగా ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చెయ్యాలని, ఇదొక్కట్టే మిమ్మల్ని కోరుకునేదని, ఉద్యోగులతో చంద్రబాబు అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read