మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని దించి, వైసిపీని ఎక్కించటంలో బీజేపీ పాత్ర అందరికీ తెలిసిందే. అయితే ఫలితాలు వచ్చి రెండు నెలలు అయ్యిందో లేదో, బీజేపీ తన ప్లాన్ మొదలు పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ, ఏపి పై కూడా ఫోకస్ పెట్టింది. చంద్రబాబుని ఎలాగూ తప్పించాం, ఘోర ఓటమి అయ్యేలా చూసాం, ఇక చంద్రబాబు పార్టీలో ఉన్న స్క్రాప్ అంతా చేర్చుకుని బలపదిపోతున్నాం అని భ్రమల్లో ఉన్న బీజేపీ, ఇప్పుడు వైసిపీ పై తన ఫోకస్ పెట్టింది. గత పది రోజులుగా, కొన్ని అంశాల పై సుతి మెత్తగా వైసిపీ ప్రభుత్వాన్ని, బీజేపీ విమర్శిస్తుంది. అయితే, ఇటు వైసిపీ నుంచి మాత్రం, ఎవరూ బీజేపీ పై విమర్శలు చేసే సాహసం చెయ్యటం లేదు. కారణం ఏంటో అందరికీ తెలుసు అనుకోండి.

bjp 19072019 2

అయితే ఈ క్రమంలో, జగన్ ప్రభుత్వం, వైజాగ్ లో ఇచ్చిన ఉత్తర్వులు, బీజేపీకి మంచి పాయింట్ తెచ్చి పెట్టాయి. వైజాగ్ లో, అన్ని చర్చిలకు సెక్యూరిటీ పెంచాలాని, నిరంతరం నిఘా ఉంచలాని, క్రైస్తవుల పై దాడులు జరగకుండా చూడాలని, వైజాగ్ పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, సామాన్య ప్రజలు మాత్రం, ఈ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారో అని ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే, ఎప్పుడూ వైజాగ్ లో మత ఘర్షణలు జరిగింది లేదు. ఆ మాటకు వస్తే, మన రాష్ట్రంలోనే గత కొన్నేళ్లుగా మాట ఘర్షణలు అనే మాటే లేదు. అయితే, ఈ ఉత్తర్వులు మాత్రం బీజేపీకి అంది వచ్చిన అవకాసం లాగా అయ్యింది. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చెయ్యటం, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వుల పై బీజేపీ ఆందోళనకు రెడీ అయ్యింది.

bjp 19072019 3

జగన్ మోహన్ రెడ్డి ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఆరోపించారు. ఇస్తే అన్ని దేవాలయాలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని, ఇలా ఒక్క చర్చిలకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ, జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరించకూడదు అని అన్నారు. ఇలాంటి చర్యల వల్లే ఘర్షణలు జరుగుతాయని అన్నారు. బీజేపీ ధార్మిక సెల్‌ మరింత ముందుకు వెళ్లి, జగన్ ప్రభుత్వానికి 48 గంటలు టైం ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని కోరింది. మత మార్పిడులు చేస్తున్న పాస్టర్ లను అడ్డుకుంటున్నామనే , ఈ ఉత్తర్వులు ఇచ్చారని మండి పడ్డారు. రాష్ట్రమంతా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి రెడీ అయ్యారని అన్నారు. తాను నమ్మే మతాన్ని అనుసరించేవారికే రక్షణ కల్పిస్తామని జగన్ చెప్పకనే చెప్తున్నారని అన్నారు. ఈ ఉత్తర్వులు రద్దు చెయ్యకపోతే, రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read