దక్షిణాదిన బీజేపీ పార్టీ ఎంత పాగా వెయ్యాలని చూసినా, వాళ్ళ వల్ల కావటం లేదు. కర్ణాటక మినహా, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నిలిపుకోవటానికి ప్రయత్నం చెయ్యటంతోనే సరిపోతుంది. తమిళనాడులో బీజేపీ అడ్రస్ లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో అక్కడ బీజేపీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే అవకాసం లేదు . ఇక కేరళలో కమ్యూనిస్ట్ ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అక్కడా బీజేపీ గెలిచే అవకాశమే లేదు. ఇక ఒరిస్సా, తెలంగాణాలో ఏదో చెప్పుకో తగ్గ బలం ఉన్నా, అదీ నామమాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్ లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సోము వీర్రాజును అధ్యక్షుడిని చెయ్యటంలోనే, ఏపిలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవని అర్ధం అవుతుంది. అయితే జనసేన పార్టీతో కలవటంతో, బీజేపీ-జనసేన కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ, సోము వీర్రాజు ప్రతి రోజు హడావిడి చేస్తున్నారు. అయితే తెలంగాణాలో మాత్రం బీజేపీ ఈ సారి గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా, ఈ సారి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని, కేసీఆర్ ని దెబ్బ కొట్టాలని, ఇంకా కుదిరితే అధికారంలోకి కూడా వచ్చేయటానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో భాగంగా, ముందుగా త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, గత 7 ఏళ్ళుగా టీఆర్ఎస్ ఇక్కడ ఏమి చెయ్యలేదని, అందుకే జీహెచ్ఏంసి ఎన్నికలు టార్గెట్ చేసి, ఇక్కడ మంచి ఫలితాలు రాబిడితే, తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలపడవచ్చు అనేది బీజేపీ ఆలోచన. జీహెచ్ఎంసిలో మంచి ఫలితాలు వస్తే, అది తెలంగాణాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభావం చూపిస్తుందని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే, జీహెచ్ఎంసి పరిధిలో ఆంధ్రా ప్రాంతం వారు గణనీయంగా ఉన్నారు. అందుకే సర్వ శక్తులు ఒడ్డి అయినా, జీహెచ్ఏంసి ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని బీజేపీ భావిస్తుంది. అయితే, ఇదంతా బాగానే ఉన్నా, ప్లాన్లు అన్నీ వర్క్ అవుట్ అవుతాయా ? ప్రజలు నిజంగానే బీజేపీని ఆదరిస్తారా ? తెలంగాణా సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరిస్తారు ? విభజన హామీలు దగ్గర నుంచి అమరావతి దాకా, అన్ని విషయాల్లో బీజేపీ అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. ఈ భావన నేను పోగొడతా, అధికారంలోకి తెస్తా అంటున్న సోము వీర్రాజు గారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read