అమరావతి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలు ఎంత గుర్రుగా ఉన్నారో, అలాగే బీజేపీ పై కూడా ప్రజలు అంతే ఆగ్రహంతో ఉన్నారు. అమరావతిని జగన్ మోహన్ రెడ్డి మార్చేసి, మూడు ముక్కలు చేస్తుంటే, అందరూ కేంద్రం ఆపుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే, వచ్చిన ప్రభుత్వం అల్లా, మేము రాజధాని మారుస్తాం అంటే, అది అయ్యే పని కాదు. ఇదే కొత్త ఒరవడి అన్ని రాష్ట్రాలు తీసుకుంటే, కేంద్రం ఏమి చేస్తుంది. అందుకే ఇలాంటి విషయాల పై కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుందని అనుకున్నారు. కానీ కేంద్రం మాత్రం, రాజధాని మా పరిధిలో అంశం కాదని తప్పించుకున్నారు. అయితే గతంలో అనేక విషయాల్లో కేంద్రం కల్పించుకున్న తీరుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పీపీఏల విషయంలో ఏమి హక్కు ఉందని కేంద్రం కల్పించుకుంది ? దేశానికి నష్టం కాబట్టి, కల్పించుకున్నారు. ఇప్పుడు రాజధాని కూడా అంతే. మరో పక్క అక్కడ 29 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడి ఆశగా కేంద్రం వైపు చూస్తుంటే, కేంద్రం చేతులు ఎత్తేసింది. దీంతో అందరు కేంద్రాన్ని తప్పు బడుతున్నారు.

బీజేపీ, జగన్ ఆడుతున్న నాటకంగా చెప్తున్నారు. అయితే ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. బీజేపీ నేత, మాజీ టిటిడి బోర్డు సభ్యులు ఒ.వి.రమణ, బీజేపీ వైఖరిని తప్పు బడుతూ, ఓక ఎడిటోరియల్ రాసారు. ఒక పక్క సుజనా చౌదరి ఒక్క ఇంచ్ కూడా ఇక్కడ నుంచి రాజధాని కదలదు అంటారు, మరో పక్క టీజీ వెంకటేష్, హైకోర్టు రాయలసీమకు వస్తే, లాభం లేదని, పూర్తి స్థాయి రాజధాని కావలి అంటారు, వెంటనే జీవీఎల్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, రాజధాని అనేది కేంద్రానికి సంబంధం లేదని, అది రాష్ట్రము ఇష్టం అని చెప్తారు. ఇక్కడ సోము వీర్రాజు గారేమో, మేము అమరావతి రైతుల తరుపున పోరాటం చేస్తున్నాం అంటారు. ఇలా ఒకే పార్టీలో ఇన్ని అభిప్రాయాలు ఎందుకు ? మనం 0.68 శాతం ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ, రేపు అధికారంలోకి రావాలి అంటే, ఇలాంటి పెద్ద విషయాల్లోనే ఒక నిర్ణయం తీసుకోక పొతే, ప్రజలు ఎలా విశ్వసిస్తారు అని ఆయన ఎడిటోరియల్ రాయటంతో, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో ఆయన ఇదే అభిప్రాయం మళ్ళీ చెప్తూ, నేను చేసింది తప్పు అయితే, జీవీఎల్ చేసింది తప్పు కదా ? సుజనా చేసింది తప్పు కదా ? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చెయ్యటం లేదు అని ప్రశ్నించారు. తాను ముందు నుంచి పోరాడుతున్నా అని, టిటిడి భూములు విషయం బయటకు తెచ్చి పోరాడిన విషయాన్నీ, పార్టీకి మంచి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఏదైనా అమరావతి మీద అందరూ పార్టీలో ఒక అభిప్రాయంతో ఉండాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read