గత ఎన్నికల్లో దగ్గర ఉండి చంద్రబాబుని ఓడించి, చేయి పట్టుకుని మరీ జగన్ ని గెలిపించిన బీజేపీ నేతలు, గత ఆరు నెలలుగా, జగన్ పాలన పై విరక్తి చెంది, జగన్ పాలన పై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉన్న కొంత మంది వైసీపీ బ్యాచ్ మాత్రం, 14 నెలలు అయినా, ఇప్పటికీ చంద్రబాబు పైనే నిందలు వేస్తూ ఉన్నారు అనుకోండి అది వేరే విషయం. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎప్పటికప్పుడు, జగన్, విజయసాయి రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా 108 స్కాం కూడా బయట పెట్టింది కన్నా లక్ష్మీ నారాయణే. దీంతో ట్విట్టర్ లో అందరినీ రెచ్చగొట్టే విజయసాయి రెడ్డి, గత కొన్ని రోజులుగా కన్నా లక్ష్మీ నారాయణను టార్గెట్ చేస్తున్నారు. జగన్ కు అనుకూలంగా ఉంటారు అని ముద్ర ఉండే సోము వీర్రాజు, నిన్న చంద్రబాబు పై విమర్శలు చేసారు. ఆ వ్యాఖ్యలు పట్టుకుని, విజయసాయి రెడ్డి, కన్నాను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు. మీ పార్టీ నాయకుడే చంద్రబాబు అవినీతి గురించి ప్రస్తావిస్తుంటే, ఎందుకు సైలెంట్ అయ్యావు కన్నా అంటూ, ట్వీట్ చేసారు.

అయితే విజయసాయి రెడ్డి మాటిమాటికి తనను అనవసరంగా టార్గెట్ చేస్తూ ఉండటం పై, కన్నా, జగన్ కు లేఖ రాసి, విజయసాయి రెడ్డిని బీజేపీ పై కాకుండా, సొంత పార్టీ పై, ప్రజా సమస్యల పై దృష్టి పెట్టే విధంగా చూడండి అంటూ, లేఖ రాసారు. దీని పై మళ్ళీ విజయసాయి ట్వీట్ చేస్తూ, లేస్తే మనిషి కాదు అంటావు, లేఖలు రాస్తావు, ఏపిలో కమలం పువ్వుని కబళించే పనిలో ఉన్న మిడతల దండులో నువ్వు భాగస్వామివా అంటూ, మరో ట్వీట్ చేసారు. ఇక విజయసాయి రెడ్డి అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి అనుకున్నారో ఏమో కానీ, డైరెక్ట్ గా ఢిల్లీ నేతలు దిగారు. బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్ తో పాటు, ఇతర నేతలు మూకుమ్మడిగా దాడి చేసారు. అన్ని రంగులు కాషాయం చేసే బలం మాకు ఉంది, మీ ఎంపీ, ఇప్పటికే మీ రంగును ఫేడ్ చేస్తున్నాడు కాపాడుకో అని ట్వీట్ చెయ్యగా, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా విరుచుకు పడ్డారు. మా సంగతి మాని, నీ గురించి, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమి చెప్పుకుంటున్నారో తెలుసుకో, మీ పార్టీలో చేరిన వారి సంగతి ఏమిటి గురివిందా ? తినటం గురించి నువ్వే చెప్పాలి అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read